సినిమా స్టోరీస్ ని డైరెక్టర్స్ వాళ్ళ ఇమేజినేషన్ అనుకూలంగా రాసుకుంటూ ఉంటారు . పూర్తిగా డైరెక్టర్స్ ఆ స్టోరీలను వాళ్ళ ఇష్టప్రకారమే రాసుకుంటూ ఉంటారు.  అయితే కొంతమంది మాత్రం  హీరో క్యారెక్టర్ ను హీరో ఫ్యాన్ ఫాలోయింగ్ బట్టి రాసుకుంటూ ఉంటారు.  మరి ముఖ్యంగా ఇప్పుడుకధ రాసే  డైరెక్టర్స్ అందరూ కూడా హీరోని ఫ్యాన్ బేస్ ని దృష్టిలో పెట్టె కధ రాసుకుంటూ ఉండడం గమనార్హం. వాళ్ళ ఫ్యాన్స్ బేస్, క్రేజ్,పాపులారిటీ, మార్కేట్ బట్టి ఆ జోనర్ లో కధ రాసుకుంటుంటారు. 


అయితే ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు . కానీ కొందరు మాత్రం సినిమా కథ ఎండింగ్ లో హీరో క్యారెక్టర్జషన్ చనిపోతే నటించమంటూ చెప్పేసే స్టార్స్ చాలా చాలా తక్కువ.  అలాంటి స్టార్స్ మన ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. కొంతమంది హీరో క్యారెక్టర్ హిట్ అవ్వాలి . అది ఎలా అయినా సరే అని అనుకునే వాళ్ళు ఉంటారు . మరి కొంత మంది హీరో క్యారెక్టర్స్ చనిపోతే సినిమా ఫ్లాప్ అయిపోతుంది అని ముందుగానే అలాంటి స్టోరీస్ ని రిజెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు . మరి ముఖ్యంగా ఇప్పటివరకు ఇండస్ట్రీలో ముగ్గురు హీరోలు అసలు చనిపోయిన క్యారెక్టర్ లోనే కనిపించకూడదు అంటూ డిసైడ్ అయ్యారు . ఇప్పటివరకు అలాంటి క్యారెక్టర్ లో నటించలేదు .



వాళ్లలో ముందు వరుసలో ఉంటాడు హీరో మహేశ్ బాబు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ  ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సూపర్ స్టార్ కృష్ణ వారసుడు మహేష్ బాబు ఎంత హై స్థానంలో ఉన్నాడో అందరికీ తెలిసిందే . ఆయన బోలెడు సినిమాలల్లో నటించాడూ.  అన్ని సినిమాలు మంచి టాక్ అందుకున్నాయి . అయితే ఇప్పటివరకు మహేష్ బాబు నటించిన ఏ సినిమాలలోనూ  ఆయన క్యారెక్టర్ చనిపోదు. అలా స్టోరీలు చూస్ చేసుకున్నాడు.  అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - విజయ్ దేవరకొండ కూడా చనిపోయిన క్యారెక్టర్ లో కనిపించడానికి ఇష్టపడరు . అలా చనిపోయిన క్యారెక్టర్  కథలు ఉన్న స్టోరీ లను రిజెక్ట్ చేశారు అంటూ డైరెక్టర్ లు చాలాసార్లు చెప్పుకొచ్చారు. కేవలం వీళ్లే కాదు ఇంకా చాలా మంది స్టార్స్ అలాంటి పాత్రల్లో నటించడానికి ఇష్టపడరు. కానీ వీళ్ల ముగ్గురు మాత్రం ఆ రీజన్ ని ఓపెన్ గానే బయట పెట్టేస్తుంటారు. మిగతా వాళ్లు ఎలాగోలా ఆ కధను వెరే రీజన్స్ చెప్పి రిజెక్ట్ చేస్తారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: