`బింబిసార‌` ఫేమ్  మల్లిడి వసిష్ఠ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ సోసియో ఫాంటసీ ఫిల్మ్ `విశ్వంభర`. చెన్నై సోయగం త్రిష, ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్లు కాగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. కేవ‌లం ఆ సాంగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంద‌ని అంటున్నారు. ఈ స్పెష‌ల్ సాంగ్ ను మాస్ బీట్స్ తో సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వ‌ర‌ప‌రుస్తున్నారు.


అయితే ఈ ఐటెం సాంగ్ లో చిరుతో క‌లిసి స్టెప్పులేసి హీరోయిన్ ఎవ‌రు? అన్న స‌స్పెన్స్ చాలా కాలం నుంచి కొన‌సాగుతోంది. యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల పేరు తెర‌పైకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. మెగాస్టార్ వంటి సీనియ‌ర్ హీరో ప‌క్క‌న మ‌రీ అంత చిన్న అమ్మాయిని తీసుకుంటే ట్రోలింగ్ ఎదుర్కోక త‌ప్ప‌దు. ఈ నేపథ్యంలోనే శ్రీ‌లీలను ప‌క్క‌న పెట్టేసి పూజా హెగ్డే, త‌మ‌న్నా, స‌మంత‌, పాయ‌ల్ రాజ్‌పుత్ వంటి హీరోయిన్ల పేర్లును ప‌రిశీలించారు. కానీ వీరెవ్వ‌రూ సెట్ అవ్వ‌లేదు.
అయితే తాజాగా విశ్వంభ‌ర‌లో ఐటెం సాంగ్ కు హీరోయిన్ దొరికేసింది. దక్ష నగార్కర్ చిరంజీవితో పాటు నర్తించే అదృష్టాన్ని సొంతం చేసుకుంద‌ని అంటున్నారు. ద‌క్ష‌ను ప్రేక్ష‌కుల‌కు కొత్త‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగులో `జాంబీ రెడ్డి` మూవీతో గుర్తింపు తెచ్చుకున్న ద‌క్ష‌.. ఆ త‌ర్వాత `బంగార్రాజు`, `రావణాసుర`, ఇటీవ‌ల `శ్వాగ్` చిత్రాల్లో మెరిసింది. హీరోయిన్‌గా క‌న్నా స్పెషల్ రోల్స్ లోనే ఎక్కువగా క‌నిపించిన ద‌క్ష‌.. విశ్వంభ‌ర మూవీలోని స్పెష‌ల్ సాంగ్ కు ఎంపిక చేయ‌బ‌డింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల‌పై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: