వరుస అపజయాలతో కష్టాల్లో ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోలు .. ఎవరికి వారు రూట్ మార్చుకుంటున్నారు .. ఇప్పటివరకు ఫాలో అయిన ఫార్ములాను పక్కనపెట్టి మరి కొత్త దారిని ట్రై చేస్తున్నారు .. ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదు అన్న గట్టి కసి నమ్మకంతో పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు యంగ్ హీరోలు . వరస అపజయాలతో కష్టాల్లో ఉన్న రామ్ పోతినేని .. ప్ర‌స్తుతం కంప్లీట్ గా తన రూటు మార్చేశారు .. స్కంద , డబుల్ ఇస్మార్ట్ సినిమాల్లో ఊరమాస్‌ లుక్స్ లో కనిపించిన ఈ యంగ్ హీరో ఇప్పుడు కూల్ లవర్ బాయ్ గా కనిపించబోతున్నారు .. ఆంధ్ర కింగ్ తాలూకా పేరుతో వస్తున్న సినిమాలో వింటేజ్ వైబ్స్‌ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు .


అలాగే మరో యంగ్‌ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తన రూటు మార్చుకున్నారు .. ఇన్నాళ్లు సీరియస్ మోడ్లో ప్రయోగాలు చేసిన వరుణ్ .. అలా మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న .. విజయాలకు మాత్రం ఎంతో దూరంగా ఉన్నాడు .. అందుకే ఈసారి సక్సెస్ ఫార్ములా తో హర్రర్ కామెడీ జోనర్ తో సినిమా చేస్తున్నాడు . అలాగే మరో అక్కినేని వారసుడు అఖిల్ కూడా తన రూటు మార్చేశాడు .. లవర్ బాయ్ గా సక్సెస్ లు వచ్చిన మాస్ హీరో అనిపించుకోవాలి అన్న కోరిక తీరకపోవడం తో మాస్ యాక్షన్ లవ్ స్టోరీ గా లెనిన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు .. ఇలా వీరే కాదు విశ్వక్‌సేన్ , కిరణ్ అబ్బవరం , సిద్దూ జొన్నలగడ్డ లాంటి హీరోలు కూడా తర్వాత సినిమాల కోసం కొత్త రూట్ ను ఫాలో అవుతున్నారు .. ఇక మరి ఈ ట్రెండ్ ఈ హీరోలకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి ..



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: