నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూతురు క్లింకారా పుట్టినరోజు.  పెళ్లైన 11 ఏళ్ల తర్వాత పుట్టింది క్లింకార.  కాగా క్లిం కారా ఫోటో చూపించండి.. ఫేస్ రివీల్ చేయండి అంటూ పుట్టినప్పటినుంచి ఫ్యాన్స్ అడుగుతూనే ఉన్నారు . కానీ మెగా ఫ్యామిలీ మాత్రం అందుకు నిరాకరిస్తుంది.  ఆమె ఫోటో రిలీజ్ చేస్తారు అంటూ ఆశలు పెట్టుకున్నారు కానీ అది కుదరలేదు.  కనీసం సెకండ్ పుట్టినరోజు కి అయిన ఫేస్ రివీల్  చేస్తారు అంటూ ఆశలు పెట్టుకున్నరు. కానీ అది కూడా కుదరలేదు .


ఈ క్రమంలోనే ఉపాసన మెగా అభిమానులకు ఓ శుభవార్తను తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టింది . ఇప్పటికే చాలా జంతువులను తేఖ్ కేర్ చేసిన ఉపాసన కొత్తగా మరో రెండు పులి పిల్లలని దత్తత్త తీసుకుంది. దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు ఉపాసన పెట్టిన పోస్ట్ బాగా ట్రెండ్ అవుతూ ..వైరల్ గా మారింది. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఆడ పులికి తన కూతురు క్లిం కారా  పేరు పెట్టినట్లు వెల్లడించింది . ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది .



"ఒక ఏడాది క్రితం ఇది కేవలం ఒక చిన్న పులి పిల్ల మాత్రమే .. కానీ ఇది ఈరోజు ఉల్లాసభరితమైన పులిపిల్లగా మారింది . దానికి నా కూతురు  క్లింకార పేరు పెట్టడం ఇంకా ఇంకా సంతోషంగా అనిపిస్తుంది . ఈ విధంగా ప్రేమ అభిమానాలు చూపించిన హైదరాబాద్ జూ బృందానికి ధన్యవాదాలు ..వన్యప్రాణులు కేవలం అడవులకే సొంతం అయినప్పటికీ వాటిని సంరక్షించడానికి మనం మద్దతు తెలుపుతూ ఉంటాం అని రాసుకొచ్చింది". అంతేకాదు ఓ రెండు పులి పిల్లలను దత్తత తీసుకొని వాటి పోషణకు సరిపడా డబ్బులను కూడా జూ పార్క్ వాళ్ళకి ఇచ్చింది . తన కూతురితో దిగిన ఫోటోను షేర్ చేసింది.  ఇందులో తల్లి ఒడిలో క్లింకార రింగులు జుట్టుతో చాలా చాలా క్యూట్ గా అనిపించింది.  కానీ పూర్తి ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు . ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కాగా మెగా ఇంటి మరో కోడలు లావణ్య త్రిపాఠి ప్రజెంట్ ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికీ తెలుసు . త్వరలోనే మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ రాబోతున్నారు. వరుణ్ తేజ్ - లావణ్య కు పాప పుడుతుందా..? బాబు పుడతాడా..? అంటీ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చలు కూడా మొదలయ్యాయి..!



మరింత సమాచారం తెలుసుకోండి: