
1949లో రిలీజ్ అయిన ఈ బాలీవుడ్ మూవీలో అశోక్ కుమార్, మధుబాల ప్రధాన పాత్రలను పోషించారు. బాంబే టాకీస్ బ్యానర్‌పై సవక్ వాచా మరియు అశోక్ కుమార్ నిర్మించిన మహల్ చిత్రానికి కమల్ అమ్రోహి దర్శకుడు. పునర్జన్మ నేపథ్యంలో సాగే సినిమా ఇది. స్టోరీ విషయానికి వస్తే.. హరి శంకర్ (అశోక్ కుమార్) అనే అరిస్టోక్రాట్ తనకు వారసత్వంగా వచ్చిన పురాతన మహల్‌లో కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. అక్కడ కామిని ఒక మర్మమైన స్త్రీను మరి శంకర్ కలుసుకుంటారు.

అప్పుటికే వరుస ఫ్లాపుల్లో ఉన్న బాంబే టాకీస్ సంస్థ మహల్ మళ్లీ ఊపిరి పోసింది. బాంబే టాకీస్ చరిత్రలో అతిపెద్ద ఆర్థిక విజయంగా నిలిచింది. ఆ రోజుల్లోనే ఈ సినిమాకు రూ.25 లక్షలకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి లెక్కల్లో ఓ రూ. 25 కోట్లు అని చెప్పొచ్చు. ఆ దశాబ్దపు అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచన మహల్ మూవీతో నేపథ్య గాయని లతా మంగేష్కర్ మరియు నటి మధుబాల కెరీర్స్ కూడా ఊపందుకున్నాయి.