
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత జూనియర్ కు జాతీయ స్థాయిలో క్రేజ్ ఏర్పడటంతో ఆ క్రేజ్ ఈమూవీతో మరింత పెరుగుతుందని అభిమానులు ఆశించారు. అయితే ఈమూవీకి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన స్టిల్స్ లో కూడ జూనియర్ గెటప్ అంతంతమాత్రంగా ఉండటంతో అభిమానులు ఆలోచనలలో పడుతున్నారు.
అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీని ‘బ్రహ్మాస్త్ర’ మూవీని దర్శకత్వం వహించిన అయాన్ ముఖర్జీ నిర్మిస్తున్నప్పటికీ ఇతడి పట్ల క్రేజ్ తెలుగు ప్రజలలో అంతంతమాత్రంగా ఉండటంతో ఈమూవీకి సరైన క్రేజ్ ఇప్పటివరకు ఏర్పడలేదు అన్న కామెంట్స్ ఉన్నాయి. బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈసినిమాకు సంబంధించిన ఒక కీలకమైన పాట ఎన్టీఆర్ హృతిక్ రోషన్ లపై చిత్రీకరించవలసి ఉంది.
ఈపాటకు సంబంధించిన స్టిల్స్ అదేవిధంగా మరొక పవర్ ఫుల్ ట్రైలర్ విడుదలైన తరువాత ఈమూవీ పై క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంటుందని మరొక వాదన వినిపిస్తోంది. ఇది ఇలా ఉండగా ఆగష్టు 14న ఈమూవీతో పోటీగా విడుదల కాబోతున్న రజనీకాంత్ ‘కూలీ’ మూవీ పై విపరీతమైన క్రేజ్ కొనసాగుతోంది. ఈమూవీలో నాగార్జున విలన్ గా నటిస్తూ ఉండటంతో పాటు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కన్నడ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తూ ఉండటంతో దేశంలోని అన్ని భాషల ప్రేక్షకులలోను ఈమూవీ పై క్రేజ్ రోజురోజుకి పెరుగుతూ ఉండటంతో ఈమూవీకి భారీ ఆఫర్లు వస్తూ ఉన్నట్లు టాక్. దీనికితోడు నాగార్జున లేటెస్ట్ గా నటించిన ‘కుబేర’ హిట్ అవ్వడంతో పెరిగిన నాగ్ క్రేజ్ ఈమూవీకి మరింత ప్లస్ పాయింట్ అనుకోవాలి..