
అప్పుడు జరిగిన ఒక సంఘటన నాకు బాగా గుర్తుందని ఆమె చెప్పుకొచ్చారు. ఒక సీన్ షూట్ పూర్తైన తర్వాత ఎంత చెత్తగా చేశావో తెలుసా.. వెళ్లి మానిటర్ చూసుకో? అని దర్శకుడు తిట్టాడని ఆ సినిమా నా మొదటి సినిమా కావడంతో ఏడ్చేశానని ఆమె చెప్పుకొచ్చారు. ఆయన అందరినీ అలానే అనేస్తాడని ఆయన కూతురు, నటి కళ్యాణి ప్రియదర్శన్ ను కూడా అలాగే తిట్టేవారని కీరి సురేష్ చెప్పుకొచ్చారు.
ఉప్పుకప్పురంబు దర్శకుడు శశి మాత్రం నటీనటులకు చాలా స్వేఛ్చ ఇస్తాడని ఈయన ఆవేశంతో తిట్టే వరకు పరిస్థితులు చేయి దాటి పోనివ్వనని అప్పటికే ఆయన చెప్పిన సీన్ లో బాగా నటిస్తానని ఆమె తెలిపారు. ఇంకో విషయం ఏంటంటే ఈ దర్శకుడు మంచి నటుడు అని చాలామంది డైరెక్టర్లు కేవలం చెబుతారని ఈ దర్శకుడు మాత్రం ఎలా చేయాలో చెప్పి చూపిస్తాడని ఆమె అన్నారు.
ఈ దర్శకుడు ఎలా యాక్ట్ చేయాలో కూడా చేసి చూపిస్తాడని ఆమె కామెంట్లు చేశారు. మళయాళ గీతాంజలి సినిమాతో కీర్తి సురేష్ కెరీర్ మొదలు కాగా తెలుగులో ఆమె ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. కీర్తి సురేష్ పారితోషికం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనే సంగతి తెలిసిందే. భవిష్యత్తు సినిమాలతో కీర్తి సురేష్ కు మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కీర్తి సురేష్ క్రేజ్ అంతకంతకు పెరుగుతోంది.