రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్లో కూడా ఇటీవలే పాల్గొన్నట్లు సమాచారం. డైరెక్టర్ హనురాగవపూడి డైరెక్షన్లో ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఒక మిలిటరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా ప్రస్తుతం జరుగుతున్న క్రమంలో ప్రభాస్ కాలికి ఫ్రాక్చర్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


అయినప్పటికీ కూడా ప్రభాస్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా షూటింగ్లో పాల్గొన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి  ప్రభాస్ కాలికి గాయం గతంలో కూడా జరిగింది..ఆయనకు సర్జరీ కూడా  జరిగిందన్న సంగతి తెలిసిందే..అయితే పరీక్షల కోసం ఆమధ్య ఇటలీకి కూడా వెళ్లి కొద్ది రోజులు విశ్రాంతి కూడా తీసుకొని మరి తిరిగి ఇండియాకి వచ్చి సినిమా షూటింగ్లో పాల్గొన్నారు ప్రభాస్.. అయితే ఇప్పుడు మరొకసారి తన కాలికి ఫ్యాక్చర్ అయిందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఫ్రాక్చర్ అయిన కాలికే మళ్లీ జరిగిందా లేక మరో కాలికా అన్న విషయం మీద ఆందోళన పడుతున్న సమయంలో టీమ్ క్లారిటీ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


 ముఖ్యంగా ప్రభాస్ కి గాయమైనప్పటికీ కూడా సినిమా షూటింగ్ జరుపుతున్నారంటే ఆయన డెడికేషన్ ఎలా ఉన్నదో చెప్పలేమంటూ అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ కాలికి గాయం అయిందని విషయంపై టీమ్ క్లారిటీ ఇస్తూ.. ఈ విషయాలన్నీ కూడా కేవలం రూమర్స్ అంటూ కొట్టి పారేసినట్లు తెలుస్తోంది. కేవలం కావాలని ఇలాంటివి ప్రభాస్ మీద చాలామంది రూమర్స్ సృష్టిస్తున్నారనే విధంగా ఫైర్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజా సాబ్ సినిమా షూటింగ్లో కూడా బిజీగా ఉన్నారు ప్రభాస్ ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ని పూర్తి చేసి.. ఈ ఏడాది విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: