
అంతేకాదు హైదరాబాదులో ఉన్న బెస్ట్ ప్రీమియం మల్టీప్లెక్స్ థియేటర్లలో ఇది టాప్ పొజిషన్లో ఉంటుంది. దాదాపు 80 కోట్లకు పైగానే ఖర్చు పెట్టి నిర్మించారు ఈ థియేటర్ ని అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . ఇందులో మొత్తం ఏడు స్క్రీన్లు ఉంటాయి . అంతేకాదు ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా ఒక మల్టీప్లెక్స్ థియేటర్ ని స్టార్ట్ చేశారు . మహేష్ బాబు అంత పెద్ద థియేటర్ కాకపోయినా అల్లు అర్జున్ ధియేటర్ కి కూడా మంచి రివ్యూస్ ఉన్నాయి. ఇది కూడా ఏషియన్ పార్ట్నర్ షిప్ లో ప్రారంభమైంది .
అంతే కాదు విజయ్ దేవరకొండ కి కూడా మహబూబ్ నగర్ లో ఓ థియేటర్ ఉంది . కానీ ఇది పెద్దది కాదు . అయితే ఇది కూడా ఏషియన్ భాగస్వామ్యంలో ప్రారంభమైంది . సో ఈ ప్రతి థియేటర్ వెనుక ఉన్న ఓ మాస్టర్ మైండ్ ఏషియన్ సినిమాస్ ఓనర్ సునీల్ నారంగ్. ఇతడికి దాదాపు 150 థియేటర్లు ఇండియా మొత్తంలో ఉన్నాయి అంటూ సమాచారం అందుతుంది . కాగా చాలామంది ఓటీటీ లు వచ్చాక థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడట్లేదుగా జనాలు అని అనుకుంటూ ఉంటారు. అయినా వీళ్ళు ఎలా థియేటర్స్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు ..? అనే డౌట్ అందరికీ ఉంది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ థియేటర్స్ ద్వారా మన స్టార్ హీరోస్ లక్షల కాదు కోట్ల సంపాదించేస్తున్నారట. మరీ ముఖ్యంగా ప్రైమ్ లొకేషన్లో థియేటర్స్ ఉండడం ..బ్రాండ్ వ్యాల్యూ అలాగే హై ప్రొఫైల్ బ్యాక్ గ్రౌండ్ ద్వారా థియేటర్స్ కి మంచి లాభాలే వస్తున్నాయట . మొత్తంగా ఈ స్టార్ హీరోస్ సినిమాలతో పాటు బిజినెస్ రంగంలోనూ దూసుకుపోతున్నారు . కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు అంటూ కామన్ పీపుల్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు..!!