సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు, వార్తల ద్వారా వనితా విజయ్ కుమార్ వేర్వేరు సందర్భాల్లో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఒకింత దూకుడుగా వ్యవహరించే వనితా విజయ్ కుమార్ కెరీర్ తొలినాళ్లలో తనపై వచ్చిన గాసిప్స్ గురించి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. చిన్న వయస్సులోనే వనితా విజయ్ కుమార్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

 తెలుగు, తమిళ భాషలతో పాటు మలయాళంలో సైతం ఆమె సినిమాలు చేశారు.  మళ్ళీ పెళ్లి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన  వనితా విజయ్ కుమార్ ఒకింత దూకుడుగానే సినిమాల్లో నటిస్తుండటం గమనార్హం.  వనితా విజయ్ కుమార్ కూతురు జోవిక నిర్మాతగా  మిసెస్ అండ్ మిస్టర్ మూవీ  జులై నెల 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా  తెరకెక్కుతోంది.

ఈ సినిమాకు వనితా విజయ్ కుమార్ దర్శకురాలిగా వ్యవహరించారు.  ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వనితా విజయ్ కుమార్  విజయ్ హీరోగా తెరకెక్కిన చంద్రలేఖ సినిమాలో తాను నటించానని ఆ సమయంలో 40 సంవత్సరాల వయస్సున్న రాజ్ కిరణ్ తో నన్ను ముడిపెట్టి వార్తలు రాశారని ఆ వార్తలను చూసి తాను తట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చారు.

నేను ఏడవడం చూసిన విజయ్  నీ గురించి వాళ్ళు ఏదీ రాయకపోతే  నువ్వు ఇండస్ట్రీలో ఉన్నా లేనట్టే  నీ గురించి  ఏదో  రాస్తున్నారంటే నువ్వు ఫెమస్ అయ్యావని అర్థం అని చెప్పుకొచ్చారు.   విజయ్  ఓదార్చడంతో తాను  కూల్ అయ్యానని ఆమె అన్నారు.  రాజ్ కిరణ్ సార్ చాలా మంచివారని అలంటి మనిషి వ్యక్తిత్వాన్ని తప్పు పట్టారని  వనితా విజయ్ కుమార్  కామెంట్లు చేశారు.  నటి వనితా విజయ్ కుమార్ పారితోషికం ఒకింత భారీ స్థాయిలోనే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: