
అయితే మిరపకాయ్ మూవీలో రిచా గంగోపాధ్యాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో అలరించిన అమ్మాయి గుర్తుందా? నిజానికి ఆ ఫ్రెండ్ పాత్రకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె స్లాంగ్ మరియు డైలాగ్ డెలివరీ అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు కదా.. స్నిగ్ధ. మిరపకాయ్ చిత్రంలో తన బొంగరు వాయిస్‌తో స్నిగ్ధ మంచి ఇంప్యాక్ట్ క్రియేట్ చేసింది.

గతంలో స్నిగ్ద మరెవరో కాదు డైరెక్టర్ హరీష్ శంకర్ భార్యే అంటూ పెద్ద ఎత్తున పుకార్లు వ్యాప్తి చెందాయి. ఈ పుకార్లపై హరీష్ శంకర్ స్వయంగా స్పందించారు. ఆమె పేరు, తన భార్య పేరు స్నిగ్ధ అవడంతో కన్ఫ్యూజ్ అయ్యారని వివరణ ఇచ్చారు. ఇకపోతే మిరపకాయ్ రీరిలీజ్ సందర్భంగా మరోసారి స్నిగ్ధ గురించి నెట్టింట చర్చలు మొదలయ్యాయి. దీంతో ఇప్పటికీ తనను మర్చిపోనందుకు థాంక్స్ తెలిపిన స్నిగ్ధ.. త్వరలో రీరిలీజ్ కానున్న మిరపకాయ్ ను తప్పక చూడమంటూ వీడియో రిలీజ్ చేసింది. ఇక ఈ వీడియోలో స్నిగ్ధను చూసి నెటిజన్లు షాకైపోతున్నారు. గుర్తుపట్టలేనంతగా ఆమె మారిపోవడమే అందుకు కారణం.
