
ఈ ఒక్క లుక్‌తో ఈ సినిమా పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ సినిమా ఖచ్చితంగా కోలీవుడ్ నుంచి రు. 1000 కోట్లు కొల్లగొట్టే తొలి సినిమాగా రికార్డులకు ఎక్కుతుందని అంటున్నారు. డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇది ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న మ్యాసీవ్ హైప్‌ను సూచిస్తోంది.
రజనీకాంత్, నాగార్జునలతో పాటు సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్, మహేంద్రన్ వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ క్రేజ్‌ను నెలకొల్పాయి. ‘చికిటు’ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. ఆనిరుధ్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్. ఈ చిత్రం 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు