చాలామంది మగవాళ్లు, అత్తింటి వాళ్ళు అమ్మాయి పుడితే ఆ స్త్రీని చాలా హీనంగా చూస్తారు. కొడుకును కనలేదని చిత్రహింసలు పెడతారు. కానీ కొడుకు పుడతాడా.. బిడ్డ పుడుతుందా అనేది స్త్రీ లో ఎలాంటి లోపం లేదు.అదంతా మగవాళ్ళలోనే ఉంటుంది. అయితే చదువుకున్న వారికి ఇది అర్థమవుతుంది. ఇప్పటికి కూడా ఇలాంటివి కొన్ని నమ్మి ఆడవాళ్ళను నిందిస్తూ ఉంటారు. కానీ ఆడ మగ అనేది స్త్రీ చేతిలో ఉంది అనేది తెలియదు. అయితే ఇలాంటివి కోటీశ్వరుల నుండి మామూలు పేదవాళ్లు దాకా ఎవరో కొంతమంది ఉంటూనే ఉంటారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ తల్లిని కొడుకు పుట్టలేదని భర్త గెంటేసారట. మరి ఇంతకీ ఆ నటి ఎవరయ్యా అంటే స్మృతి ఇరానీ.. నటిగా.. రాజకీయ నాయకురాలుగా.. భారతదేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్మృతి ఇరానీ జై బోలో తెలంగాణ సినిమాతో ఫేమస్ అయ్యింది.

అలాగే కేంద్ర మంత్రిగా కూడా పనిచేసింది.అయితే అలాంటి స్మృతి ఇరానీ ఓ ఇంటర్వ్యూలో తన తల్లి గురించి మాట్లాడుతూ..మా నాన్న వాళ్ళు నాకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు ఇంట్లో నుండి గెంటేసారు. అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను. మా అమ్మకు ఎప్పటికైనా సరే ఒక ఇల్లు కొనివ్వాలని. కానీ చాలా రోజులు అమ్మ అద్దెకు ఉండే ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. గత ఆరు సంవత్సరాల క్రితం అమ్మకు ఒక సొంతిల్లు కొనిచ్చాను.అలా అమ్మ ఫ్రీగా ఉండడం ఇష్టం లేక నాకు నెలకు ఒక్క రూపాయి అద్దె చెల్లిస్తుంది. మా అమ్మని నాన్న కొడుకును కనివ్వలేదు అనే ఒకే ఒక్క కారణంతో ఇంట్లో నుండి గెంటేసాడు. అప్పటి నుండి కష్టాలంటే ఏంటో తెలిసేలా పెరిగాను. ఎన్నో కష్టాలు అనుభవించాను అంటూ స్మృతి ఇరానీ చెప్పుకొచ్చింది.

 పలు యాడ్స్ సీరియల్స్ ద్వారా ఫేమస్ అయ్యి కొన్ని సీరియల్స్ ని కూడా నిర్మించింది.ఆ తర్వాత  రాజకీయాల్లోకి వచ్చి బిజెపి తరఫున ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి కూడా అయి ప్రజలకు సేవ కూడా చేసింది. అయితే అలాంటి స్మృతి ఇరానీ తల్లిదండ్రుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నప్పుడు 150 రూపాయలు చేతిలో ఉన్నాయట. అమ్మ డిగ్రీ చదివింది. నాన్న చదువుకోలేదు.నాన్న ఆర్మీ క్లబ్ బయట బుక్స్ అమ్మేవాడు. అమ్మ ప్రతి ఇంటికి తిరిగి మసాలా దినుసులు అమ్మేది. ఇక అమ్మ నాన్న పెళ్లయ్యాక కొద్ది రోజులు డబ్బులు లేక పశువుల కొట్టంలోని ఓ గదిలో నివసించే వారు అంటూ తన తల్లిదండ్రుల పరిస్థితి గురించి కూడా చెప్పుకొచ్చింది.అలా స్మృతి ఇరానీ ఎన్నో కష్టాలు పడుతూ చివరికి ఉన్నత స్థాయికి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: