టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో `SSMB29` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ బిగ్ ప్రాజెక్ట్ ను ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే. జంగిల్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌. పృథ్వీ రాజ్ సుకుమరన్ ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తున్నాడు. ఈ ఏడాది జనవరి షూటింగ్ ప్రారంభమైంది. భారతీయ చలనచిత్రాల్లోనే అత్యధిక బ‌డ్జెట్‌తో నిర్మిత‌మ‌వుతున్న‌ ఈ సినిమా గురించి గ్లోబ‌ర్ బ్యూటీ ప్రియాంక చొప్రా ఏకంగా హాలీవుడ్ మీడియాలో ప్ర‌స్తావించ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా ఉంది.


అయితే డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట‌ర్ గా మ‌హేష్ మూవీ గురించి ఓ ఆంగ్ల మీడియాలో ప్రియాంక చోప్రా ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. వివాహం అనంతరం ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. అక్కడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ స్థిరపడింది. చాలాకాలం తర్వాత ఈ భామ ఒక ఇండియన్ ఫిల్మ్‌కు అది కూడా తెలుగు చిత్రానికి సంతకం చేసింది. ఇదే విషయాన్ని హాలీవుడ్ మీడియాతో ప్రియాంక పంచుకుంది.


`నేను ఇండియాను, హిందీ సినిమాలను ఎంత‌గానో మిస్ అవుతున్నాను. ఈ ఏడాది ఒక భారతీయ సినిమాలో నటిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ కోసం చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. భారతీయ ప్రేక్షకులు నాపై చూపే ప్రేమ ఎంతో విలువైనది. అది ఎల్లప్పుడూ అలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను` అంటూ చెప్పుకొచ్చింది. అయితే ప్రియాంక ఎక్సైట్ అవుతున్నాన‌ని చెప్పింది మహేష్ బాబు మూవీ గురించే అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆమె కామెంట్స్ నెట్టింట‌ వైరల్ గా మారాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: