
కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ అదే విధంగా బన్నీ పేరు మారుమ్రోగిపోతుంది. దానికి కారణం పుష్ప సినిమా. ఒకప్పుడు పుష్ప కోసం బన్నీ ఏదైతే రిస్క్ చేశాడో.. ఇప్పుడు అదే రిస్క్ చేయబోతున్నాడు డ్రాగన్ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఓ న్యూస్ తెర పైకి వచ్చింది . సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పుష్ప . ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే . బాక్స్ ఆఫీస్ చరిత్రను తిరగరాసింది . అల్లు అర్జున్ కిస్పెషల్ పేరు తీసుకొచ్చింది .
పుష్ప వన్ సినిమాలో సినిమా క్లైమాక్స్లో అండర్వేర్ తో నిల్చుకొని ఒక ఫైట్ సీన్లో కనిపిస్తాడు అల్లు అర్జున్ . అప్పట్లో దీనిపై కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేసిన సినిమాకి ఫైట్ సీన్స్ హైలైట్ గా మారాయి. ఇప్పుడు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ సైతం అండర్వేర్ తో ఒక ఫైట్ సీన్ లో నటించబోతున్నారట . అది కూడా డ్రాగన్ సినిమాలో. అది కూడా ప్రశాంత్ నీల్ సజెస్ట్ చేసిన కోరిక ప్రకారం . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ చేసిన పని జూనియర్ ఎన్టీఆర్ కూడా చేయబోతున్నాడా..?? వీళ్లిద్దరు మాట్లాడుకుంటున్నారా ఏంటి? నీ సినిమాలో ఈ సీన్స్ హిట్ అయ్యాయి ..నా సినిమాలో కూడా అలాగే పెట్టుకుంటాను అనే విధంగా వీళ్ళు మాట్లాడుకుని ఇలా చేస్తున్నారా..? అంటూ రకరకాలుగా జనాలు కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో డ్రాగన్ సినిమాకి సంబంధించిన హ్య్స్ష్ ట్యాగ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి..!!!