టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటించిన చిత్రం కింగ్డమ్. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది.డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి  డైరెక్షన్లో వస్తున్న ఈ స్పై యాక్షన్ త్రిల్లర్ చిత్రంపై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది.. ఈనెల 31న ఈ సినిమా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. నిన్నటి రోజున విడుదలైన టీజర్ మరింత ఆకట్టుకుంది.


విజయ్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. కింగ్డమ్ సినిమా తర్వాత డైరెక్టర్  విజయ్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్లో ఒక పిరియాడికల్ యాక్షన్ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఇప్పటికే అటు రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య లవ్ ఎఫైర్ రూమర్స్ రోజుకి ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా హాలీవుడ్ రిపోర్టర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత జీవితం గురించి ఒక విషయంపై అయితే క్లారిటీ ఇచ్చారు.


తనకు 35 ఏళ్లు కచ్చితంగా తానైతే సింగిల్ కాదంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో అభిమానులు రష్మిక తో ఇప్పటికే వస్తున్న రూమర్స్ కు మరింత బలాన్ని చేకూర్చేలా  విజయ్ దేవరకొండ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా రష్మిక పేర్లు మాత్రం చెప్పలేదు. అయితే తన పర్సనల్ లైఫ్ కి మాత్రం ఎక్కువగా ప్రైవసీ విలువ ఇస్తానంటూ వెల్లడించారు. నటుడుగా ఎంతో క్రేజ్ అందుకోవాలనుకున్నా గుర్తింపు రావాలన్న కోరిక ఉంటుంది ఆ సమయంలో కూడా ప్రైవసీగా కూడా కొన్ని విషయాలను ఉంచాలని ఆలోచన కూడా కలుగుతుందని తెలిపారు. దీంతో విజయ్ ఇలా మాట్లాడడంతో మళ్లీ సోషల్ మీడియాలో రిలేషన్ స్టేటస్ గురించి పది రకాల చర్చ మొదలయ్యింది. ఇప్పటికీ ఎన్నో సందర్భాలలో అటు రష్మిక విజయ్ దేవరకొండ ఎయిర్పోర్ట్ వెకేషన్ వంటి ప్రాంతాలలో కనిపిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: