టాలీవుడ్ లో తాజాగా ప్రముఖ నటి ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది.. మరొకసారి ఆమె తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్టుని సైతం షేర్ చేసింది. ఈ మేరకు బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను వీడియోలను కూడా తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేయడంతో అభిమానులు కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నారు. ఇక ఆ నటి ఎవరో కాదు కన్నడ నటి చైత్ర రాయ్. ఈమె ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్రలో చాలా అద్భుతంగా నటించింది.



దేవర చిత్రంలో కనిపించింది తక్కువ సేపు అయినా కూడా స్క్రీన్ పైన ఉన్నంతసేపు ఇమే ప్రత్యేకించి మరి అందరిని ఆకట్టుకుంది. తెలుగుతో పాటు కన్నడ వంటి భాషలలో కూడా పేరు బాగా సంపాదించిన చైత్ర రాయ్ ప్రముఖ ఇంజనీర్ ప్రసన్న శెట్టిని వివాహం చేసుకుంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న అష్టా చమ్మ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అందులో స్వప్న అనే పాత్రలో కనిపించింది. ఆ తర్వాత మనసున మనసై, దట్ ఇస్ మహాలక్ష్మి, రాధకు నీవే రా ప్రాణం అంటూ తదితర సీరియల్స్లలో కూడా నటించి భారీ క్రేజ్ అందుకుంది.


అలాగే కొన్ని రకాల టీవీ షోలలో కూడా సందడి చేస్తూ ఉన్న చైత్ర రాయ్ వివాహం తర్వాత క్రమంగా సీరియల్ కు దూరమై ప్రస్తుతం పలు చిత్రాలలో నటించింది. దేవర సినిమాతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన చైత్ర రాయ్ తాజాగా షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారుతున్నది. మరి దేవర 2 చిత్రంలో నైనా చైత్ర రాయ్ పాత్ర మరింత ఎక్కువగా ఉంటుందేమో చూడాలి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే వీరికి ఒక పాప కూడా ఉన్నది ఇప్పుడు ముగ్గురు నుంచి నలుగురు కాబోతున్నామనే విషయాన్ని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: