
ట్రైలర్ విషయానికి వస్తే.. అభి తల్లిదండ్రులు చాలా గారాబంగా తనని పెంచుతూ ఉంటారు. ముఖ్యంగా అభి అంటే తన తండ్రికి చాలా ఇష్టం కాలేజీకి వెళ్లిన తర్వాత అక్కడ తన క్లాస్మేట్ అయినా స్ఫూర్తిని ప్రేమిస్తారు అప్పటివరకు అభి జీవితం సాఫీగా జరిగిన కానీ తన తండ్రి ఊరులో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న తర్వాతే జీవితం పూర్తిగా మారి మరి అక్కడి నుంచి మరో లెవల్లో టర్నింగ్ అయ్యేలా కనిపిస్తోంది ట్రైలర్లో. ట్రైలర్లో కామెడీ సన్నివేశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీ లీల, కిరీటి మధ్య వచ్చే సన్నివేశాలు బాగానే ఆకట్టుకుంటున్నాయి.
అలనాటి హీరోయిన్ జెనీలియా కూడా ఇందులో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈమె పాత్ర కూడా హైలెట్ గా ఉన్నది.జూనియర్ సినిమా ఒక మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ కి మెప్పించేలా కనిపిస్తున్నది. ఫుల్ ఎమోషనల్ గా ఈ సినిమా ట్రైలర్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇంతటి ఎమోషనల్ సన్నివేశాలతో సినిమాని గట్టెక్కించడం సులభం అవుతుందా లేదా తెలియాలి అంటే మరో కొన్ని రోజులు ఆగాల్సిందే. మరి మొదటిసారి హీరోగా ఎంట్రీ ఇచ్చిన గాలి జనార్దన్ రెడ్డి కొడుకు ఏ విధంగా సక్సెస్ అందుకుంటారో చూడాలి మరి. ప్రస్తుతం అయితే ట్రైలర్ వైరల్ గా మారుతున్నది.