
ఆమె ఎవరో తెలుసా ? మహారాష్ట్ర మాజీ సీఎం, లోకసభ స్పీకర్ మనోహర్ జోషి మనవరాలు – అందాల భామ శార్వరీ వాఘ్ ! అందం విషయంలో కానీ, నటన విషయంలో కానీ శార్వరీ ఎక్కడా తగ్గడం లేదు. స్టార్ట్ చేశింది అసిస్టెంట్ డైరెక్టర్‌గా.. సంజయ్ లీలా భన్సాలీ వంటి దిగ్గజుల దగ్గర పనిచేసింది. ఆ తర్వాత హీరోయిన్‌గా మారింది. ‘బన్ బార్ బార్’, ‘ముంజ్యా’ సినిమాల ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ .. ఇంకా సాలిడ్ హిట్ మాత్రం తగలడం లేదు. శార్వరీ సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తోంది. గ్లామరస్ ఫొటోలు , స్టైలిష్ లుక్స్‌తో నెట్టింట్లో కుర్రాళ్ల గుండెల్లో కొట్లాటే. ప్రతి ఫొటోకూ లైక్స్ వర్షం, కామెంట్ల తుఫాను. ఫ్యాషన్ సెన్స్ విషయంలో బీటౌన్‌లో టాప్ లిస్ట్‌లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
మొన్నటి వరకు ఆషికీ 3లో హీరోయిన్ ఛాన్స్ శార్వరీకి దక్కిందనే టాక్. కానీ ఆ రూమర్స్‌కి ఫుల్ స్టాప్ పడింది. ఆ ప్లేస్‌లో ఇప్పుడు టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల ఫిక్స్ అయ్యిందట. కానీ శార్వరీ మాత్రం మరో హిట్ కోసం ఫుల్ జోష్‌లో వెయిట్ చేస్తోంది. పాలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినా.. తనకు నటన మీద ఉన్న ప్యాషన్ వల్లే ఈ స్థాయికి వచ్చింది శార్వరీ. ఒకసారి హిట్ పడితే.. ఆమె కెరీర్ మరో లెవల్‌కు వెలుతుంది అనే విషయం లైట్ కాదు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా సెటిలవ్వడం లక్ష్యంగా దూసుకుపోతుంది. మరి ఈ హాట్ బ్యూటీకి బీటౌన్‌లో బ్రేక్ ఇస్తున్న సినిమా ఏదవుతుందో.. చూడాలి!