
ఉత్తరాంధ్ర డీల్ పూర్తైన నేపథ్యంలో ఇతర ఏరియాల హక్కులతో ఓజీ మరిన్ని సంచలనాలు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నా ఆ సినిమాలు సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు. సాధారణ కథలతోనే అసాధారణ విజయాలను అందుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.
పవన్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా సినిమాలలో కూడా కెరీర్ ను కొనసాగిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నిర్మాత దానయ్యకు సైతం ఈ సినిమా సక్సెస్ సాధించడం ఎంతో కీలకమని చెప్పవచ్చు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే దానయ్య రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.
ఆర్ఆర్ఆర్ తర్వాత దానయ్య నిర్మిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. దాదాపుగా 200 కోట్ల రూపాయల రేంజ్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా పవన్ స్థాయిని ఎన్నో పెంచడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు