టాలీవుడ్ కింగ్ నాగార్జున వందో చిత్రం కోసం అక్కినేని అభిమానులు ఎంతో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే నటసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఆ మైల్ స్టోన్ ని అధిగమించగా.. ఇప్పుడు నాగార్జున వంతొచ్చింది. నాగార్జున వందో చిత్రాన్ని తమిళ దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కించబోతున్నాడు. కార్తీక్ కు పెద్దగా అనుభవం లేదు. పెద్ద హీరోలతో పనిచేసిందీ లేదు. కానీ కథపై ఉన్న నమ్మకంతో నాగార్జున ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.


ఈ బెంచ్ మార్క్ ఫిల్మ్ ను నాగార్జున పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. సో.. మార్కెట్ పరంగా వర్కౌట్‌ అవ్వాలంటే అందుకు తగ్గ స్టార్స్ సినిమాలో ఉండాలి. ఈ నేప‌థ్యంలోనే నాగార్జున వందో చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే కత్రినాతో సంప్రదింపులకు కూడా ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి.
కాగా, గతంలో కత్రినా కైఫ్ విక్టరీ వెంకటేష్ కు జోడిగా `మల్లీశ్వరి` చిత్రంలో నటించింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆన్ స్క్రీన్ పై వెంకీ, కత్రినా కెమిస్ట్రీ కూడా ఆక‌ట్టుకుంది. ఆ తర్వాత ఆమె తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. ఎన్నో ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆమె బాలీవుడ్‌కే ప‌రిమితం అయింది. మళ్ళీ ఇన్నేళ్లకు నాగార్జున మూవీతో టాలీవుడ్ లోకి క‌త్రినా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో వావ్ ఇది రా జోడి అంటే అని ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: