తెలుగు సినీ పరిశ్రమలో తన కంటూ నటుడి గా అద్భుత మైన క్రేజ్ ను , గుర్తింపు ను సంపాదించు కున్న వారి లో కోటా శ్రీనివాసరావు ఒకరు. ఈయన ఎన్నో సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన నటుడుగా కెరియర్ను కొన సాగించారు. గత కొద్ది కాలంగా కోటా శ్రీనివాసరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ రో జు ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల పాటు గొప్ప నటుడు గా కెరియర్ను కొనసాగించిన ఇలాంటి నటుడు మరణించడంతో కోటా శ్రీనివాసరావు మరణం పై అనేక మంది సినీ ప్రముఖులు , రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ వస్తున్నారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి కూడా కోటా శ్రీనివాసరావు మరణం పై స్పందించాడు.

తాజాగా కోట శ్రీనివాసరావు మరణం గురించి చిరంజీవి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు. తాజాగా చిరంజీవి మేమిద్దరం కూడా ప్రాణం ఖరీదు అనే సినిమాతో సినిమా కెరియర్ను ప్రారంభించాం. ఆయన ఎన్నో విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు. ప్రతి పాత్రను కూడా తాను మాత్రమే చేయగలడు అన్నంత గొప్పగా ఆయన నటించారు. ఇటీవల కుటుంబంలో జరిగిన విషాదం ఆయన్ను మానసికంగా చాలా కొంగ తీసింది.  కోటా మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చిరంజీవి పేర్కొన్నారు. ఇకపోతే కోటా శ్రీనివాసరావు సినిమాల్లోకి రాక ముందు ఎస్బిఐ బ్యాంకులో పని చేసేవారు. బ్యాంకులో పని చేస్తూనే నాటకాల్లో నటించేవారు. ఇక చిరంజీవి , కోటా శ్రీనివాసరావు ఇద్దరు కూడా ప్రాణం ఖరీదు అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: