సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయికి చేరుకొని స్టార్ హీరోలుగా , స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగిస్తున్న ఎంతో మంది కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన వారు కూడా ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో హీరోగా , హీరోయిన్లుగా అవకాశాలను దక్కించుకొని అక్కడ కూడా సూపర్ గా సక్సెస్ అయ్యి ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా , స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన బ్యూటీలు ఎంతో మంది ఉన్నారు. ఇకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ గా కొంత మంది నటించిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నట్లయితే వారి క్రేజ్ భారీగా పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి వారికి మంచి ర్యేమునరేషన్లను కూడా ఇస్తూ ఉంటారు. చైల్డ్ ఆర్టిస్టుగా అత్యధిక పారితోషకం తీసుకుంటున్న అమ్మాయి ఎవరో తెలుసా ..? ఆమె మరి ఎవరో కాదు సారా అర్జున్. 

ఈమె ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన ఎంతో మంది నటీ నటులతో కలిసి నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమాల్లో అందరి కంటే ఎక్కువగా నాలుగు లక్షల వరకు పారితోషకాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఈమె ఇప్పటివరకు అత్యధిక పారితోషకాన్ని చైల్డ్ ఆర్టిస్టుల్లో అందుకున్న నటిగా తెలుస్తోంది. ఇంత కాలం పాటు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోంది. సారా అర్జున్  "ధురంతర్" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ నటులలో ఒకరు అయినటువంటి రన్వీర్ సింగ్ హీరో గా నటించాడు. ఈ మూవీ కనుక మంచి విజయం అందుకున్నట్లయితే హీరోయిన్గా కూడా ఈమెకు మంచి క్రేజ్ దక్కే అవకాశం ఉంది అని , అలాగే స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు కూడా ఈమెకు పుష్కలంగా ఉంటాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: