మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. రవితేజ ఆఖరుగా ధమాకా అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత రవితేజ నటించిన చాలా సినిమాలు విడుదల అయ్యాయి. కానీ అందులో ఏ సినిమా కూడా మినిమం విజయాన్ని కూడా అందుకోలేదు. దీనితో రవితేజ కెరియర్ గ్రాఫ్ పడిపోతుంది అని , ఆయన కచ్చితంగా మంచి విజయాన్ని అందుకోవాలి , అలా అందుకున్నట్లయితే ఆయన కెరియర్ డేంజర్ లో పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అని  కొంత మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న మాస్ జాతర మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.

సూర్య దేవర నాగ వంశీ ఈ మధ్య కాలంలో నిర్మించిన సినిమాలలో చాలా శాతం మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. దానితో నాగ వంశీ నిర్మిస్తున్న మూవీ కావడంతో మాస్ జాతర మూవీతో రవితేజకు మంచి విజయం దక్కుతుంది అని చాలా మంది భావిస్తున్నారు. ఇకపోతే రవితేజ ఈ మధ్య కాలంలో నటించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈ మూవీ కి ఓ టీ టీ డీల్ కూడా పెద్ద గొప్ప స్థాయిలో జరిగే అవకాశాలు ఉండేది అని కూడా కొంత మంది భావించారు. కానీ మాస్ జాతర మూవీ కి సూపర్ సాలిడ్ ఓ టి టి డీల్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా మాస్ జాతర సినిమా ఓ టీ టీ హక్కులను ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ దక్కించుకోవడంతో ఈ మూవీ ఇప్పటికే సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయినట్లు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మాస్ జాతర మూవీ ని ఆగస్టు 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt