మాస్ మహారాజా రవితేజ ఆఖరుగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈయన మిస్టర్ బచ్చన్ కంటే ముందు నటించిన కొన్ని సినిమాలు కూడా అపజయలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... భాను భోగవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

మూవీ ని ఆగస్టు 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మూవీ కి సంబంధించిన స్క్రిప్ట్ పనులను ఇప్పటికే కిషోర్ తిరుమల పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ను చాలా స్పీడ్ గా పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలి అని ఈ మూవీ బృందం వారు డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.

కానీ రవితేజసినిమా విషయంలో పారితోషకం చాలా ఎక్కువగా డిమాండ్ చేయడం , రవితేజకు వరుస అపజయలు ఉండడంతో మాస్ జాతర సినిమా విడుదల అయిన తర్వాత ఆ మూవీ రిజల్ట్ను బట్టి రవితేజ , కిషోర్ తిరుమల సినిమా ముందుకు జరిగే అవకాశాలు ఉన్నాయి అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ ఈ వార్త కనకే నిజం అయితే ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కావడం కాస్త కష్టం అవుతుంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt