"కోట శ్రీనివాసరావు" గురించి అందరికీ తెలిసిందే . నిక్కాస్ అయిన మనిషి . ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మనస్తత్వం గల మనిషి. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆయన నెలకొల్పిన రికార్డ్స్ అన్ని ఇన్ని కాదు.  దాదాపు 750 కి పైగా సినిమాలలో నటించి.. కోటా శ్రీనివాసరావు తన లోని టాలెంట్ ఏంటో జనాలకి ప్రూవ్ చేసుకున్నాడు. విలనిజం.. హాస్యం ..కరుణ.. రౌద్రం ఇలా అన్ని రకాల రసాలను పండించి పరిపూర్ణమైన నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు . అలాంటి నటుడు ఇప్పుడు మన ఇండస్ట్రీలో లేకపోవడం నిజంగా బాధాకరం .

నేడు తెల్లవారుజామున నాలుగు గంటల నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు . కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు గారు ఆయన స్వగృహంలోనే తుదిస్వాశ విడిచారు. కోటా శ్రీనివాసరావు సినీ ఎంట్రీ చాలా విచిత్రంగా జరిగింది. బ్యాంక్ లో ఉద్యోగం చేసుకుంటూ లైఫ్ ని ముందుకు తీసుకెళుతున్న కోట శ్రీనివాసరావు .. నాటకాలు పై ఉన్న ఇంట్రెస్ట్ తో అటువైపుగా నాటకాలు వేయడం ఆ తర్వాత అవకాశాలు దక్కించుకోవడం సినీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకున్నాక కూడా కొన్ని పాత్రలు ఆయనకు సవాల్ గా మారడం అందరికీ తెలిసిందే.

మరీ ముఖ్యంగా "ఆహ నా పెళ్ళంట" సినిమా లో "లక్ష్మిపతి" పాత్ర ఆయన కెరియర్ ని మలుపు తిప్పింది . ఈ పాత్ర ఆయన తప్పితే ఎవరు చేయలేరు అని చెప్పడంలో సందేహమే లేదు . వరుసగా నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీకు ఎన్నో సేవలందించి ఆయన నటనతో ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించిన కోటా శ్రీనివాసరావు కెరియర్ ఎండింగ్లో మాత్రం "పాత్రలు ఇవ్వండయ్యా" అంటూ ప్రాదాయపడ్డారు . దర్శకులు త్రివిక్రమ్ లాంటివాళ్ళు తనకు మంచి పాత్రలు ఇవ్వాలి అంటూ కోరారు .

ఫ్రీగా కూడా సినిమాలు చేయడానికి రెడీ అంటూ సిద్దమే అన్నారు.  ఆయన వయోభారంతో బాధపడుతున్న మూమెంట్లో ఇండస్ట్రీలో పెద్దగా డైరెక్టర్లు ఆయనకు అవకాశం ఇవ్వలేదు . అలాంటి నటుడిని పిలిపించి ఇక్కడ ఇబ్బంది పెట్టడం కన్నా విశ్రాంతి తీసుకోవడమే మంచిది అంటూ కొంతమంది ఆయనకు అవకాశాలు ఇవ్వలేకపోయారు.  ఆ టైంలో కోటా శ్రీనివాసరావు నాకు అవకాశాలు ఇవ్వండి.. నేను కళామతల్లి బిడ్డను.. నేను సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండలేను ..ఏ అవకాశం ఇచ్చిన చేస్తాను" అంటూ తనకు దగ్గరైన డైరెక్టర్లతో చెప్పుకొచ్చారు . అంతేకాదు మా ఎలక్షన్.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కోటా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఆ సమయంలో కూడా ఆయనకు పూర్తిగా ఆరోగ్యం బాగాలేదు .. అలాంటి సమయంలో కూడా తన హక్కుని కోల్పోకుండా ఓటును వినియోగించుకున్నారు.  దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  అలాంటి మంచి మనిషిని కోల్పోయామా అంటూ సినీ ప్రముఖులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు . ప్రతి ఒక్కరూ కూడా కోట శ్రీనివాసరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు..!





మరింత సమాచారం తెలుసుకోండి: