- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ - అల్లు ఫ్యామిలీల ల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పైకి అంతా బాగానే కనిపించిన లోపల మాత్రం రెండు కుటుంబాల మధ్య అంతర్గత యుద్ధం సాగుతోంది. తెలియకుండానే ఒకరిపై మనకు విమర్శలు చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాను మెగా హీరోల అభిమానులు టార్గెట్ చేశారు. ఈ సినిమా ఎలా హిట్ అవుతుందో చూస్తామంటూ మెగా అభిమానులు స‌వాళ్లు విసిరారు. అయితే పుష్ప పార్ట్ 1 సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ టైంలో మెగా హీరోలు ఎవరు స్పందించలేదు. అల్లు అర్జున్ అరెస్టు ఎపిసోడ్ లో కూడా మెగా ఫ్యామిలీ సైలెంట్ గా ఉంది. చిరంజీవి మిన‌హా రామ్ చ‌రణ్ - వరుణ్ తేజ్ - సాయి ధరమ్ తేజ్ ఇలా ఏ మెగా హీరోలు ఎవరు అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఈనెల 24న రిలీజ్ అవుతుంది.


సినిమా గత నెల 12న ఈ సినిమా రిలీజ్ కావలసి ఉంది. ఆ టైంలో థియేటర్ల బంద్ అంశం తెరమీదకు వచ్చింది. దీని వెనక ఆ నలుగురు ఉన్నారంటూ.. అందులో అల్లు అరవింద్ కూడా ఉన్నారని ప్రచారం జరిగింది. సినిమాకు పోటీగా అల్లు అరవింద్ మరో సినిమాను విడుదల చేస్తున్నారు. కన్నడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ నిర్మించిన మహావతార నరసింహ సినిమాని ఆయన ఏపీ - తెలంగాణలో తన గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేస్తున్నారు. దీనిపై ఓవర్గం అభిమానులలో మంచి అంచనాలు ఉన్నాయి. వీరమల్లు వచ్చిన మరుసటి రోజు 25నే ఈ సినిమా విడుదల చేస్తున్నారు. అంటే ఎలా అయినా వీరమల్లు సినిమాకి నరసింహ సినిమాతో కొంత ఎఫెక్ట్ అయినా ఉంటుంది. అల్లు అరవింద్ వీరమల్లు సినిమాను వదిలేలా లేరని.. కావాలని ఆయన వీర‌మ‌ల్లుకు పోటీగా నరసింహా సినిమాను రిలీజ్ చేస్తున్నారని టాలీవుడ్ సర్కిల్స్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: