సీనియర్ నటి సావిత్రి సరోజా దేవి వీళ్లిద్దరి మధ్య ఉప్పు నిప్పు లాంటి రిలేషన్ ఉండేదని వీరిని దగ్గర నుండి చూసిన చాలా మంది అంటూ ఉంటారు. ముఖ్యంగా తనకంటే వెనుక వచ్చిన సావిత్రి కి దర్శక నిర్మాతలు, హీరోలు అంత ప్రియారిటీ ఇవ్వడం సరోజా దేవికి అస్సలు నచ్చేది కాదు. దీంతో సావిత్రికి ఎలా అయితే చేస్తున్నారో నాకు కూడా అలాంటి మర్యాదలే కావాలి అని సరోజా దేవి తరచూ ఇండస్ట్రీ వాళ్ళతో గొడవలు పడుతూ ఉండేదట. అలా సరోజాదేవి సావిత్రి స్టార్డం ని స్అసలు ఓర్చేది కాదని కొంతమంది అంటూ ఉంటారు. అలా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా గొడవలు ఉండే సరోజా దేవికి సావిత్రి ఎందుకు ఇచ్చింది..అది తిరిగి సరోజా దేవి ఇవ్వలేదా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. సావిత్రి ఎన్నో నగలు ఉండేవి.

అంతేకాదు తన ఇంట్లో కొత్త కొత్త డిజైన్లు చేసే స్వర్ణకారులే ఉండేవారట. అయితే ఎన్ని నగలు ఉన్నా కూడా సావిత్రికి రవ్వల నెక్లెస్ అంటే చాలా ఇష్టం ఉండేదట.ఆ రవ్వల నెక్లెస్ తన కూతురు విజయ చాముండేశ్వరి ఎక్కడ తీసుకు వెళుతుందోనని భయపడి నటి సరోజా దేవికి దాచమని ఇచ్చిందని,కానీ ఆ తర్వాత అడిగితే సరోజా దేవి నాకు ఇవ్వలేదని సమాధానం చెప్పినట్టు ఆ మధ్య కాలంలో వార్తలు వినిపించాయి. అయితే వీరిద్దరి గురించి తెలిసిన కొంతమంది అసలు సరోజా దేవికి సావిత్రికి పడనే పడదు. అలాంటిది సావిత్రి దాచమని ఎందుకు ఇస్తుంది.ఇదంతా క్రియేట్ చేసిన రూమర్ మాత్రమే అని అంటూ ఉంటారు.

ఇక మరి కొంతమందేమో లేదు లేదు సరోజా దేవికి చిన్న చిన్న దొంగతనాలు చేసే అలవాటు గతంలో ఉండేది. ఆమె హోటల్ కి వెళ్తే హ్యాండ్ కర్చీఫ్ లు వంటివి తీసుకొచ్చేది. అలా ఓ సమయంలో పట్టుబడితే కేసు కాకుండా ఎంజీఆర్ బయట పడేశారు అని అప్పటి జనరేషన్ వాళ్లు మాట్లాడుకుంటారు. అలా సావిత్రి రవ్వల నెక్లెస్ సరోజా దేవి నిజంగానే తీసుకుందని మరికొంతమంది అంటారు.కానీ వీరిద్దరిని దగ్గరినుండి చూసిన వాళ్ళు మాత్రం సరోజా దేవి కి సావిత్రి నగ ఇచ్చింది అనడం అవాస్తమని, అది కేవలం రూమర్ మాత్రమే అని అంటూ ఉంటారు. ఇక ఇందులో ఏది నిజం ఏది అబద్దం అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు.

మరింత సమాచారం తెలుసుకోండి: