డార్లింగ్ ప్రభాస్ ..ప్రెసెంట్ పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు . తన గురించి తను పట్టించుకునే అంత టైం కూడా లేకుండా సినిమాలకి కమిట్మెంట్ ఇచ్చేసాడు ప్రభాస్.  అలాంటి ప్రభాస్ రీసెంట్గా హైదరాబాద్ లోని ప్రసాద్  మల్టీప్లెక్స్ కు వచ్చారు. పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి బ్రాడ్ ఫీట్ నటించిన "F11" సినిమాను చూస్తూ ఎంజాయ్ చేశారు. థియేటర్లలో అభిమానుల మధ్యలో తన ఫేవరెట్ అయిన "F1" సినిమాను చూస్తూ రెబెల్ స్టార్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశాడు. అది కూడా తనకి ఎంతో స్పెషల్ పర్సన్ అయినా ప్రశాంత్ నీల్ తో ..దీనికి సంబంధించిన పిక్స్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ "సలార్" అనే సినిమాలో నటించాడు.  దీనికి సీక్వెల్ కూడా ఉంది . సలార్ 2 త్వరలోనే సెట్స్ పైకి రాబోతుంది . ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ నీల్ - ప్రభాస్ ఇద్దరు కలిసి "F1" సినిమాను చూస్తూ కనిపించడం అది కూడా థియేటర్లలో అభిమానుల మధ్యలో కూర్చొని చూసి ఎంజాయ్ చేయడం బాగా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ ఇలా బయట కనిపించడం చాలా చాలా రేర్.  ఇప్పుడు ఆయనకి సంబంధించిన ఈ ఫోటోలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.  సాధారణంగా పెద్ద పెద్ద స్టార్స్ సినిమాల ప్రీమియర్లలోనే కనిపిస్తూ ఉంటారు.



కానీ ప్రభాస్ చాలా ఢిఫరెంట్. ఇలా సడన్గా ఓ హాలీవుడ్ సినిమా చూస్తూ మన తెలుగు హీరో కనిపించేసరికి  అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది . ఎంతో స్టార్ స్టేటస్ ఉంది కోట్ల ఆస్తి కూడా ఉంది.  కానీ సింపుల్గా ఫ్యాన్స్ మధ్య మూవీ చూడడానికి ఇష్టపడ్డాడు ప్రభాస్ . అదే ప్రభాస్ అంటే అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ప్రభాస్ అభిమానులు ఆయన నటిస్తున్న ఫౌజీ , స్పిరిట్, సలార్ 2 సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అన్నిటికంటే ఎక్కువగా సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ తో ప్రభాస్ నటిస్తున్నాడు అని తెలిసి స్పిరిట్ మూవీ పై హై ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు.  ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది..? అనే దాని గురించి ఎక్కువగా చర్చించుకుంటూ మాట్లాడుకుంటున్నారు..!!





మరింత సమాచారం తెలుసుకోండి: