
అయితే ఇండస్ట్రీలో ముగ్గురు హీరోయిన్స్ మాత్రం ఓ విషయంలో కామన్ గా ముందుకు వెళ్తున్నారు. అదే వాళ్ళని స్టార్ హీరోయిన్ గా మార్చింది అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మరెవరో కాదు రష్మిక - కాజల్ అగర్వాల్ - సమంత . ముగ్గురు అందంగా ఉంటారు . చక్కగా నటిస్తారు . కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . "లక్ష్మీ కళ్యాణం" అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది . అయితే కాజల్ ఏ రేంజ్ లో ఇండస్ట్రీని తన అందచందాలతో ఊపేసింది అనేది అందరికీ తెలుసు .
దానికి మెయిన్ రీజన్ కాజల్ ఫ్యాన్ ఫాలోయింగ్ . ఆమె ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియా వేదికగా నిరంతరం అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంటుంది . అదేవిధంగా సమంత కూడా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా అభిమానులకి టచ్ లో ఉంటుంది . ఆ కారణంగానే వీళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. తద్వారా మంచి మంచి అవకాశాలు రావడం ఆ అవకాశాలను వినియోగించుకోవడం జరిగింది. ఇప్పుడు అదే రూట్ లో ముందుకు వెళుతుంది రష్మిక మందన్నా. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తుంది . అన్ని సినిమాలు కూడా మంచి హిట్ అయేటివే. రష్మిక ఎంత బిజీగా ఉన్నా వారానికి ఒక్కసారైనా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పలకరిస్తుంది. ఇలా అభిమానులతో నిరంతరం టచ్ లో ఉండడం కారణంగానే వాళ్ళ ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. ఆ తర్వాత డైరెక్టర్స్ వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. ఈ ముగ్గురు హీరోయిన్స్ లో ఆ క్వాలిటీ ఉండటం గమనార్హం..!