ఒక తెలుగోడి సత్తా ఏంటో ప్రపంచ స్థాయికి చాటి చెప్పిన చిత్రం `బాహుబలి` రాజమౌళి దర్శకత్వంలో రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో.. ఎన్ని రికార్డులను సెట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే `బాహుబలి ది బిగినింగ్` విడుద‌లై ప‌దేళ్లు పూర్తైన సంద‌ర్భంగా మ‌ళ్లీ ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు రాజ‌మౌళి రెడీ అయింది. కాక‌పోతే ఇది రీరిలీజ్ కాదు. తొలి భాగాన్ని `కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?` అనే బిగ్ సస్పెన్స్‌తో ఎండ్ చేయగా... రెండో భాగంలో దానికి స‌మాధానం రివీల్ చేస్తూ ముగించారు.


ఇప్పుడు ఈ రెండు పార్టుల‌ను ఒకే మూవీగా `బాహుబ‌లి ది ఎపిక్‌` పేరుతో అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డింది. దీంతో బాహుబ‌లి సంద‌డి మ‌ళ్లీ మొద‌లైంది. అయితే తాజాగా ఓ నెటిజ‌న్ `బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప చంప‌క‌పోయుంటే ఏం జ‌రిగేది?` అంటూ స‌ర‌దాగా ఓ ప్ర‌శ్న వేశాడు.


అందుకు రానా ద‌గ్గుబాటి ఇచ్చిన స‌మాధానం ఇప్పుడు వైర‌ల్ గా మారింది. స‌ద‌రు నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు రానా రియాక్ట్ అవుతూ.. `ఒక‌వేళ క‌ట్ట‌ప్ప ఆ ప‌ని చేయ‌క‌పోయుంటే నేనే బాహుబ‌లిని చంపేవాడ్ని` అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చాడు. దీంతో నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఓ వ్య‌క్తి `సినిమా చూసాక అసలు నీ తప్పే లేదనిపించింది బ్రో, నేను రాజయ్యాక నువ్వే సేనాధిపతివి అంటే ఎవరికైనా కాలుద్ది, ఎవరైనా అదే చేస్తారు` అని రానాను ఉద్ధేశించి కామెంట్ పెట్ట‌డం విశేషం.  


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: