
అసలు సినిమా ఎలా ఉంటుందో, కథా నేపథ్యం స్పష్టంగా తెలియకపోయినా, నోలన్ యొక్క మాస్టర్ స్టోరీ టెల్లింగ్‌ను అభిమానులు ఎగబడుతున్నారు . గతంలో "ఓపెన్ హెయిమర్", "ఇంటర్‌స్టెల్లార్", "ఇన్‌సెప్షన్", "టెనెట్" వంటి సినిమాల ద్వారా నోలన్ తనకంటూ ఓ భిన్నమైన ప్రేక్షక వర్గాన్ని ఏర్పరచుకున్నారు. కథ అర్థం కాకపోయినా ఫీల్, విజువల్స్ కోసం మళ్ళీ మళ్ళీ చూసే అలవాటు ఆయనే ఏర్పరిచారు. గ్రీకు ఇతిహాసం ఆధారంగా "ఒడిస్సీ ..ఈ సినిమా పేరు "ఒడిస్సీ" అన్నప్పటికీ ఇది సైన్స్ ఫిక్షన్ కాదు. గ్రీకు ఇతిహాసంలో ప్రముఖమైన ట్రోజన్ యుద్ధం అనంతరం రాజు ఒడిస్సియస్ చేసిన చిరస్మరణీయ ప్రయాణం ఆధారంగా ఈ కథను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఈ కథను నోలన్ తనదైన శైలిలో చూపించబోతున్నారు. ఇప్పటికే పూర్తి IMAX ఫార్మాట్ లో షూటింగ్ జరిపిన ఈ సినిమా కోసం దాదాపు 250 మిలియన్ డాలర్ల బడ్జెట్ ఖర్చు చేశారు.
పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నోలన్ శ్రద్ధ ... ఇప్పటికే షూటింగ్ పూర్తైన "ఒడిస్సీ" ప్రస్తుతం విస్తృతమైన విజువల్ ఎఫెక్ట్స్ మరియు సౌండ్ మిక్సింగ్ వర్క్‌లో ఉంది. నోలన్ సినిమా అంటే కథకంటే ఎక్కువగా సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్, అందుకే ఆయన ప్రతి ఫ్రేమ్‌ను పెర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దేందుకు నెలల తరబడి పని చేస్తున్నారు. 2025 జూలై 17 – నోలన్‌దే స్టేజ్! ... ఇప్పటి నుంచే ఈ స్థాయిలో క్రేజ్ ఉంటే, విడుదల తేదీ సమీపిస్తున్న సమయంలో ఇంకెంత హడావిడి ఉంటుందో ఊహించలేం. 2025 జూలై 17న వచ్చే ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పోటీ లేకుండా ఓ మాస్ రిలీజింగ్ డేలా కనిపిస్తోంది. ఏ హీరోల సినిమా అయినా ఆ తేదీ దాటించుకుంటుందేమో చూడాలి! ఇంతకీ... ఒక సంవత్సరం ముందే టికెట్లు సోల్డ్ అవుట్ చేసిన ఘనత నోలన్‌కే దక్కినట్టే!