కృష్ణ ముకుంద మురారి..ఈ సీరియల్ అప్పట్లో ఎంత పాపులర్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్లో కృష్ణగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ప్రేరణని చాలామంది ఇష్టపడ్డారు. ముఖ్యంగా తన క్యూట్ క్యూట్ స్మైల్ కి,చిన్నపిల్లల మనస్తత్వంతో మాట్లాడే మాటలకి ఎంతో మంది ఆకర్షితులయ్యారు. అంతేకాకుండా ఆమె ఈ సీరియల్ లో వేసే బ్లౌజులకి ఫుల్ డిమాండ్ ఉండేది.అలా ఒకే ఒక్క సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రేరణకి తెలుగు బిగ్ బాస్ 8లోకి వెళ్లే అవకాశం వచ్చింది.అలా బిగ్ బాస్ లోకి వెళ్లి తన ఆట తీరుతో స్ట్రాంగ్ కాంటెస్టెంట్ గా చివరి వరకు పోరాడింది. అయితే బిగ్ బాస్ కి వెళ్లకముందే ప్రేరణకు శ్రీపాదతో పెళ్లైన సంగతి మనకు తెలిసిందే. 

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న  ప్రేరణ శ్రీపాదకు బ్రేకప్ చెప్పాను అనే మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు బిగ్ బాస్ కి వెళ్లి వస్తే ఎవరికైనా బ్రేకప్ విడాకులు ఖాయమే..ఎందుకంటే బిగ్బాస్ తర్వాత కొంతమందికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అంటూ పాత కంటెస్టెంట్లను దృష్టిలో పెట్టుకొని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రేరణ బ్రేకప్ చెప్పడం ఏంటి పెళ్లి చేసుకున్న భర్తకు విడాకులు ఇవ్వాలి కదా బ్రేకప్ ఏంటి అని మీ అందరికీ డౌట్ రావచ్చు.అయితే బ్రేకప్ చెప్పింది నిజమే. కానీ ఇప్పుడైతే కాదు. తాజా ఇంటర్వ్యూలో ప్రేరణ మాట్లాడుతూ.. నాకు శ్రీపాదకీ గొడవలే లేవు అని మీరు అనుకోవద్దు.

ఎందుకంటే మాకు కూడా చిన్న చిన్న గొడవలు ఉంటాయి.ఒకప్పుడు నేను నిన్ను భరించలేను అని శ్రీపాదకీ బ్రేకప్ కూడా చెప్పాను. కానీ ఆ తర్వాత చాలా తొందరగా మళ్ళీ కలిసి పోయే వాళ్ళం. ఇక రష్మిక ఇండస్ట్రీలో స్టార్ అవ్వకముందు నాకు క్లోజ్ ఫ్రెండ్.ఇప్పుడు కూడా క్లోజ్.కానీ ఎక్కువగా కలవడం లేదు.ఒకప్పుడు నేను టాలీవుడ్ లో రష్మిక కన్నడలో స్టార్స్ అవుతామని రష్మిక పేరెంట్స్ అనేవారు. ఎన్నో కలలు కన్నాను. కానీ ఏ ఒక్కటి నిజం కాలేదు.ఇక రష్మికతో అప్పుడు నేను క్లోజ్ కానీ ఇప్పుడు గుర్తున్నానో లేదో తెలియదు.రేయ్ నన్ను ఒకసారి కలవరా అంటూ చాలా ఎమోషనల్ గా రష్మికను ఉద్దేశిస్తూ ప్రేరణ మాట్లాడింది. మరి ప్రేరణ మాటలు రష్మిక దాకా చేరుతాయా..మళ్ళి తన ఫ్రెండ్ ని కలుస్తుందా అనేది తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: