
అఫ్కోర్స్ ఈ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రావడం లేదు . వచ్చిన అవకాశాలు అన్నీ కూడా బోల్డ్ పాత్రలే వస్తున్నాయి. అటువంటి పాత్రల్లో నటించడం ఇష్టం లేకనే షాలిని పాండే సినిమాలకి దూరంగా ఉంటుంది . కాగా చాలా కాలం తర్వాత తెలుగు సినిమాకి సైన్ చేసినట్టు తెలుస్తుంది . అది కూడా మన ఎన్టీఆర్ నటించబోయే సినిమాలో . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్ . ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిపోయింది . రెండవ హీరోయిన్ కోసం మృణాల్ , శృతిహాసన్, రష్మిక మందన్నా లాంటి స్టార్ పేర్లు వినిపిస్తున్నాయి .
అయితే ఈ సినిమా తర్వాత దేవర 2ని సట్స్ పైకి తీసుకోరాబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాలో ఆల్రెడీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ కోసం అందాల ముద్దుగుమ్మ షాలినీ పాండేను చూస్ చేసుకున్నారట మూవీ మేకర్స్. ఆమె క్యారెక్టర్ ఎక్కువ సేపు ఉండదు .. ఆమె ఆ పాత్రలో మరణించేస్తుందట. కానీ చాలా ఎమోషనల్ గా ఉంటుందట. ఆ కారణంగానే షాలిని పాండే ఆ ఆఫర్ ని మిస్ చేసుకోకుండా ఓకే చేసిందట . పైగా ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో అని పలు సందర్భాలలో చెబుతూనే వచ్చింది. ఎవరైనా తన ఫేవరెట్ హీరోతో నటించే ఛాన్స్ వస్తే మిస్ చేసుకుంటారా..? త్వరలోనే ఎన్టీఆర్ - షాలినీ పాండే కలిసి నటించబోతున్నారు అన్న న్యూస్ ఇప్పుడు సినీ వర్గాలలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది..!