
ఇండియన్ సినిమా చరిత్రలో తొలిసారిగా ఫుల్ డాల్బీ అట్మోస్ ఫార్మాట్‌లో విడుదల కానున్న ప్రాజెక్ట్ గా వార్-2 నిలవనుంది. అంటే, ప్రేక్షకులు థియేటర్‌లోకి అడుగు పెట్టిన క్షణం నుంచి ఒక అద్భుతమైన ఆడియో విజువల్ అనుభూతిని పొందనున్నారు. మేకర్స్ ఇప్పటికే ఈ టెక్నికల్ అప్‌గ్రేడ్ కోసం భారీ ప్లానింగ్ చేశారు. విదేశాల్లోనూ అత్యధిక డాల్బీ అట్మోస్ థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈరోజు విడుదలైన ట్రైలర్‌తోనే వార్-2 ఎక్కడికక్కడ టాప్ రేపింది. ఎన్టీఆర్ పవర్ ఫుల్ షోతో, హృతిక్ స్టైల్, భారీ విజువల్స్—అన్నీ కలిసి కంప్లీట్ ప్యాకేజ్‌గా ట్రెండ్ అవుతుంది. సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఓ మాసివ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఆ ఈవెంట్‌కు తారక్ స్వయంగా చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు. తారక్ మెయిన్ అట్రాక్షన్‌గా ఉండే ఈ ఈవెంట్ సినిమా బజ్‌ను హైపర్ లెవెల్‌కి తీసుకెళ్లే అవకాశం ఉంది. వార్-2తో ఎన్టీఆర్ మాత్రమే కాదు, తెలుగు సినిమా ప్రభావం కూడా బాలీవుడ్‌లో మరింత పటిష్ఠంగా మారనుంది. అలాగే ఎన్టీఆర్ స్పై యాక్షన్ ఫామ్‌లో హిందీ ఆడియెన్స్‌ను ఊపేసే సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు. ఇక విడుదల తేదీ దగ్గరపడుతున్న వేళ, మేకర్స్ మరిన్ని పోస్టర్లు, పాటలు, ఇంటర్వ్యూలతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని పెంచాలని ఫిక్స్ అయ్యారు. ఇలా చూస్తే.. వార్-2 ఒక భారీ బ్లాక్‌బస్టర్ దిశగా ముందుకెళ్తోంది. తెరపై ఎన్టీఆర్ – హృతిక్ కాంబో ఎంత అద్భుతంగా వర్కౌట్ అవుతుందో చూడాలంటే.. మరికొద్ది రోజులు ఆగాల్సిందే!