సూపర్ స్టార్ రజినీకాంత్ ,డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ఆవైడెడ్ చిత్రం కూలి. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్, పూజా హెగ్డే, అమీర్ ఖాన్ తదితర నటీనటులు నటిస్తూ ఉన్నారు. ఆగస్టు 14న ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో హీరోయిన్ శృతిహాసన్ పాల్గొని కూలి చిత్రం పైన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. కూలి సినిమాలో పనిచేయడం తనకు చాలా స్పెషల్గా అనిపించిందని తెలిపింది.


ఎందుకంటే ఇందులో నాగార్జున సార్ మొదట నెగిటివ్ పాత్ర కాబట్టి ఇందులో అతను అద్భుతంగా నటించారు. ఆయన నటన చూశాక నాగార్జున సార్ కి అభిమానిగా మారిపోయానంటు తెలిపింది శృతిహాసన్. మేమంతా కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్.. రజినీకాంత్ సార్ చాలా కూల్ పర్సన్.. ఆయన చాలా పెద్ద పేరు కలిగిన వ్యక్తి ఎన్నో విజయాలను సాధించారు. కానీ ఇప్పటికీ ఆయన చుట్టూ ఉన్న వారందరినీ చాలా ఆనందంగా ఉంచడానికి చూస్తారని తెలిపింది. కూలి చిత్రంలో తను సత్యరాజ్ సార్ కూతురిగా నటించబోతున్నానని తెలిపింది.



తాను ఇనిమెల్ మ్యూజిక్ వీడియో చేయాలనుకున్న సమయంలో లోకేష్ కనకరాజు తనకు స్క్రిప్ట్ వివరించారని.. ప్రీతి పాత్రలో తనని నటించమని అడిగారు. దీంతో స్టోరీ నచ్చడంతో తాను కూడా ఒప్పుకున్నానని తెలియజేసింది శృతిహాసన్. ఇందులో తన పాత్ర చాలా బలమైనదని అందరూ తన పాత్రతో కనెక్ట్ అవుతారని వెల్లడించింది శృతిహాసన్. శృతిహాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అంటూ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు. శృతిహాసన్ చేతిలో ప్రస్తుతం ట్రైన్, జననాయగన్, సలార్ 2  వంటి చిత్రాలలో నటించబోతోంది. శృతిహాసన్ కి పాత్ర నచ్చితే స్పెషల్ సాంగ్ లలో నైనా , కీలకమైన పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగానే ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: