తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ అంటే చాలామందికి టక్కున గుర్తుకు వచ్చేది విజయశాంతి మాత్రమే.. ఈమె ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా ఎదిగింది. ఒక సమయంలో చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్ లాంటి హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంది. అలా ఇండస్ట్రీలో ఎంతో ఎత్తుకు ఎదిగినటు వంటి విజయశాంతి జనరేషన్ అయినటువంటి 80,90 బ్యాచ్ అందరూ కలిసి ప్రతి ఏడాది  పార్టీ ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరు ఆతిథ్యమిస్తారు. అలాంటి ఈ పార్టీపై విజయశాంతి ఒక షాకింగ్ కామెంట్ చేసింది. ఆమె ఏమన్నదో ఆ వివరాలు చూద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి విజయశాంతి కాంబినేషన్లో దాదాపు 18 వరకు సినిమాలు వచ్చాయి.

 అప్పట్లో వీరిద్దరు సినిమాలో ఉన్నారు అంటే  థియేటర్లన్నీ ఫుల్ అయిపోయాయి.. నటన పరంగా డాన్స్ పరంగా అద్భుతమైన పోటీ వీరి మధ్య ఉండేది. అందుకే ఈ జంటకు ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఎప్పుడైతే విజయశాంతి సొంతంగా లేడీ ఓరియంటెడ్ పాత్రలు చేసుకుంటూ వచ్చిందో అప్పటి నుంచి చిరంజీవితో సినిమాలు చేయడం మానేసింది. అంతేకాదు ఆయనతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఇదంతా పక్కన పెడితే  చిరంజీవి తరం జనరేషన్ హీరో హీరోయిన్లు  ప్రతి ఏడాది ఏదో ఒక దగ్గర కలుస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, రాధా, రాధికా, రమ్యకృష్ణ,మీనా,సుహాసిని, సుమలత వంటి స్టార్స్ ఉంటారు.

 ఇంతమంది పార్టీకి వచ్చిన విజయశాంతి మాత్రం ఎప్పుడూ హాజరు కాలేదు. అయితే ఆ పార్టీ కి ఎందుకు రాలేదు క్లారిటీ కూడా ఇచ్చింది. అయితే ఇలాంటి పార్టీలకు నన్ను పిలవరని ఒకవేళ పిలిచినా నేను రానని తెలియజేసింది. నేను వెళ్తే షూటింగ్ లేదంటే ఇల్లు లేదంటే రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రోగ్రాంలకు మాత్రమే హాజరవుతానని అన్నది. ఇలాంటి పార్టీలకు వెళ్లే రకాన్ని నేను కాదని, వారందరు వేరు నేను వేరు అంటూ చెప్పుకొచ్చింది విజయశాంతి. అంతే కాదు చిరంజీవి ఎప్పుడూ నన్ను ఆ పార్టీకి పిలవలేదు ఒకవేళ పిలిచినా నేను వెళ్ళను అంటూ మాట్లాడింది.ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: