
లోకేష్ కనగరాజ్ తన సినిమాలలో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఖైదీ, విక్రమ్, లియో వంటి సినిమాలు ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమైన ఈ దర్శకుడు కూలీ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటాననే నమ్మకాన్ని అయితే కలిగి ఉన్నారు.
అయితే కూలీ సినిమాకు 50 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్న ఈ దర్శకుడు తాను తుపాకులపై పెట్టుబడులు పెడుతున్నానంటూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. తనకు రైఫిల్ షూటింగ్ అంటే చాలా ఇష్టమని రైఫిల్ క్లబ్ లో మెంబర్ షిప్ కూడా ఉందని ఆయన తెలిపారు. నా సంపాదనలో కొంత మొత్తాన్ని తుపాకుల కోసం ఖర్చు చేస్తానని ఆయన పేర్కొన్నారు.
తన కుటుంబం పెద్ద కుటుంబం అని ఆనందం కోసం సంపాదనలో కొంత మొత్తాన్ని గన్స్ పై ఖర్చు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. కూలీ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. లోకేష్ కనగరాజ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు