
టాలీవుడ్ లో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్న రెండు భారీ సినిమాలు నందమూరి బాలకృష్ణ అఖండ-2 మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ. ఈ రెండు సినిమాలు దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానున్నాయి. రెండు సినిమాల మధ్య పోటీ మామూలుగా ఉండబోదని ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమలో సంక్రాంతి తర్వాత దసరా సీజన్ ఇంపార్టెంట్. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు క్రేజీ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద హై-వోల్టేజ్ పోరు తప్పదు. ఓజీ పవన్ మాస్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఈ సినిమా ఉండబోతోందని దర్శకుడు సుజిత్ హామీ ఇచ్చాడు. ఇక బాలకృష్ణ కు ‘అఖండ’ ఎంతటి మాస్ బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. బోయపాటి శ్రీను డబుల్ ఇన్నింగ్స్ ప్లాన్ చేస్తూ ‘అఖండ-2’ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. చివరి సాంగ్ కూడా ఆగస్టు ఫస్ట్ వీక్ లో పూర్తవనుంది..
సెప్టెంబర్ 25న విడుదలకు ముహూర్తం ఖరారవడంతో ఇప్పుడు ఈ రెండు సినిమాల పోటీ టాలీవుడ్‌ను హీలెక్కిస్తోంది. ఈ రెండు సినిమాలకు ఒక అన్‌ప్లాన్డ్ సవాల్ ఎదురవుతోంది. అదే కాంతారా ప్రీక్వెల్ – 'కాంతార: ఛాప్టర్ 1స. కాంతారా చిత్రానికి అప్పట్లో దేశవ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. ఇప్పుడు దాని ప్రీక్వెల్ అక్టోబర్ 2న విడుదల అవుతుండడంతో, ‘అఖండ-2’, ‘ఓజీ’లకు వచ్చిన వారం రోజుల్లోనే కాంతార కూడా థియేటర్లలో దుమ్ముదులిపే అవకాశం ఉంది. ఇది కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. పాజిటివ్ టాక్ వస్తే కాంతార ప్రీక్వెల్ ఓ భారీ బెంచ్‌మార్క్ గా నిలవొచ్చు. ఇక మూడు సినిమాల మధ్య థియేటర్ల వార్ కూడా తప్పదు. ఈ ట్రయాంగిల్ పోటీలో ఎవరు విజేతలవుతారో, ఎవరి కంటెంట్ ప్రేక్షకుల మనసు దోచుకుంటుందో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు