
బ్రాండ్ ఎండార్స్మెంట్లు , ఫ్యాషన్ లైన్ లు, ఫుడ్ బ్రాండ్ లల్లో ఇలా విభిన్న రంగాలలో అడుగుపెడుతూ ఉంటారు . పలువురు హీరోయిన్స్ కూడా జిమ్ బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే . అలాంటి వ్యాపార చాతుర్యం చూపిస్తున్న వారిలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉంటాడు . తాజాగా ఆయన ఒక క్రేజీ బిజినెస్ ద్వారా వార్తల్లో నిలిచారు. రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ . తక్కువ ధరలకు ఫ్లాట్లు కొనుగోలు చేసి మార్కెట్ విలువలు పెరిగిన తర్వాత వాటిని అమ్మేస్తూ భారీ లాభాలను గడిస్తున్నాడు.
ఆయన ఈ రంగంలో తన తెలివితేటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు . ఇటీవల అక్షయ్ కుమార్ ముంబై బోరివల్లి ప్రాంతంలో ఉన్న రెండు అపార్ట్ మెంట్ లను 7 కోట్లకు అమ్మారు. గతంలో ఆయన ఆ ఆ ప్రాపర్టీని 3 కోట్లకి కొనుగోలు చేశాడు. ఈ ఫ్లాట్లు ఆయన 2017లో కొనుగోలు చేశారు. అప్పుడు వాటి ద్వారా మూడు కోట్లు మాత్రమే. అయితే ఆయన అమ్మింది మాత్రం చాలా చాలా హై కాస్ట్ . ఇది మాత్రమే కాదు మార్చి లో అక్షయ్ కుమార్ అదే బోర్వెల్లి ఏరియాలోని మరొక రెండు ప్లాట్లను ఆరు కోట్లకు విక్రయించారు . అలాగే ఏప్రిల్ లో ముంబై లోయర్ పారల్ ప్రాంతంలోని ఓ ఆఫీస్ ప్లేస్ ని 8 కోట్లకు అమ్మారు . ఇలా సినిమా ఇండస్ట్రీలోనే కాదు బిజినెస్ లో కూడా తనదైన తెలివితేటలతో ముందుకు వెళ్తున్నాడు అక్షయ్ కుమార్..!