
కల్కి 2.. సలార్ 2.. ఫౌజీ ..స్పిరిట్ ఇలా ఒకటారెండా బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్ అని తన ఖాతాలో వేసుకోవడం పక్క అంటున్నారు అభిమానులు. ఇలాంటి మూమెంట్లోనే ప్రభాస్ కి సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్ కి తల్లిగా చాలా సినిమాలలో పలు నటీమణులు నటించి మెప్పించారు . కానీ ప్రభాస్ కి మాత్రం ది పర్ఫెక్ట్ గా బాగా మ్యాచ్ అయిన హీరోయిన్ మాత్రం నదియా అని ..ఇది ఆయనే ఓ సినిమా ఈవెంట్లో చెప్పుకొచ్చారు. చాలామంది తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న తల్లి క్యారెక్టర్ లో మాత్రం నదియా బాగా కనెక్ట్ అయ్యారు అని .. నదియా గారి నటన చాలా బాగుంటుంది అని పొగిడేశారు.
సోషల్ మీడియాలో అప్పుడు ప్రభాస్ ని భలే ఆటపట్టించారు . "మిర్చి" సినిమాలో వీళ్లిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు . మిర్చి సినిమాలో ప్రభాస్ పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ . ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ప్రభాస్ కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ అప్పుడు ఓ రేంజ్ లో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేశారు అభిమానులు . ప్రభాస్ ఏ డైలాగ్ చెప్పిన పర్ఫెక్ట్ గా ఉంటుంది అనేది అభిమానులు అభిప్రాయం . కాగా ఛత్రపతి సినిమాలో ఒక్క అడుగు ఒకే ఒక్క అడుగు అంటూ ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో.. ఆ తర్వాత బుజ్జిగాడు సినిమాలో డార్లింగ్ అంటూ అంతకంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాడు..!!