సినీ ప్రియులు ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న చిత్రం కూలీ. హీరోగా రజినీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనకరాజు డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా బాలీవుడ్ లో విడుదల చేయడంపై అమీర్ ఖాన్ ప్రమేయం ఉందనే విధంగా గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. వీటికి తోడు వార్ 2 ఆగస్టు 14నే రిలీజ్ కాబోతోంది.



నార్త్ లో ఎక్కువగా మల్టీప్లెక్స్ థియేటర్లలో వార్ 2 సినిమా రిలీజ్ కాబోతోంది. దీంతో కూలీ చిత్రం కోసం అమీర్ ఖాన్ ఐనాక్స్, పివిఆర్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు వినిపిస్తున్నాయి.. దీంతో అమీర్ ఖాన్ డిస్ట్రిబ్యూషన్ పై కీలకమైన పాత్ర పోషిస్తున్నారని విధంగా బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయంపై తాజాగా అమీర్ ఖాన్ టీమ్స్ స్పందిస్తూ.. ఆ వార్తలన్నీ కూడా రూమర్స్ అంటూ కొట్టి పారేసింది. అమీర్ ఖాన్ తో పాటుగా అతని టీమ్ ఎవరూ కూడా కూలి సినిమా పంపిణీలో ఎలాంటి జోక్యం చేసుకో లేదంటు తెలియజేశారు.



కూలీ సినిమా విషయంలో అమీర్ ఖాన్ ఎవరికీ కూడా ఫోన్ చేయలేదని.. కేవలం అమీర్ ఖాన్ అతిధి పాత్రలో మాత్రమే నటించారని.. అది కూడా రజనీకాంత్, లోకేష్ కనకరాజు తో ఉన్న స్నేహబంధం వల్లే ఆ పాత్రను అంగీకరించారని తెలియజేశారు. కూలీ సినిమా విషయానికి వస్తే రూ.350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.ఇందులో పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ లో కనిపించగా.. నాగార్జున విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ఉపేంద్ర, శృతిహాసన్, సత్యరాజ్, మహేంద్రన్, సౌబిన్ షాహిర్ వంటి వారు నటించారు. సంగీతాన్ని అనిరుధ్ అందిస్తున్నారు. ఇటీవలే యూట్యూబ్ లో అమీర్ ఖాన్ నటించినటువంటి సితారే జమీన్ పర్ చిత్రాన్ని విడుదల చేశారు. మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: