ఈ వారం థియేటర్లలో హడావుడి లేదు… పెద్ద సినిమాలు అడుగుపెట్టలేదు. వార్ 2, కూలీ వంటి బిగ్ బడ్జెట్ మూవీస్ వదిలేసిన వారం ఇది. కానీ అదే సమయంలో ఓ చిన్న తెర మీద పెద్ద దుమారం రేగుతోంది – అదే "మయసభ". ప్రముఖ దర్శకుడు దేవా కట్టా పంచ్ డైలాగ్స్‌తో, రాజకీయం మిక్స్ చేసి తీయడంలో ఎలా మాస్టర్‌రో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మాస్ క్లాస్ డోస్‌తో ఓటీటీ తెర మీదకి దిగారు!

నాయక్ వర్సెస్ నాయక్: కథల వెనుక కథలూ!
మయసభ సిరీస్‌ అంటే చరిత్రలోని రాజకీయ పాత్రలకు వాస్తవ కల్పనల మిక్స్. ఇందులో ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు, డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ జర్నీని చూపించారు. ఈ పాత్రల్లో ఆది పినిశెట్టి (బాబు), చైతన్య రావు (వైఎస్) నటన ఓ రేంజ్ లో ఉందని ప్రాథమికంగా రివ్యూలు చెబుతున్నాయి. అయితే అసలు కిక్కేంటంటే, వీళ్లిద్దరి మధ్య స్నేహం, సహకారం, పెళ్లిళ్ల కలయికలు వంటి అంశాలు చూపించడం!

నిజమా కల్పితమా? పబ్లిక్ డిబేట్ స్టార్ట్!
ఇప్పటికే సీరీస్ రిలీజైన కొద్ది గంటల్లోనే ఓటిటీలో టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. కానీ అందులో చూపిన కొన్ని సన్నివేశాలు పబ్లిక్ డిస్కషన్‌కు కారణమయ్యాయి.

* వైఎస్.. ఎన్టీఆర్ ఫ్యాన్‌లా చూపించారు.

* చంద్రబాబు – వైఎస్ మధ్య స్నేహబంధం ఉంది అన్నట్లు చూపించారు.

* చంద్రబాబుకు ఎన్టీఆర్ కూతురిని సంబంధం పెట్టిచ్చిందీ వైఎస్సే అన్నట్టు చూపించారు.

ఇవి వాస్తవానికి పూర్తిగా భిన్నంగా ఉండటం, పౌరాణిక శైలిలో కథను మలచడం నెటిజన్లకు షాక్ ఇచ్చింది. "కథ కోసం కల్పనలేనా, లేక క్యారెక్టర్స్‌కి సేవ చేయడమేనా?" అనే డిబేట్ నడుస్తోంది. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు మాత్రం – "ఇవి రియాలిటీకి దూరం... ప్రజల దృష్టిని మళ్లించేందుకు కల్పిత రిప్రజెంటేషన్" అని అభిప్రాయపడుతున్నారు.

క్యూరియాసిటీ కరెక్టే.. కాని కాన్టెంట్?
మయసభలో 70ల నుంచి 90ల దాకా అసలైన పాలిటికల్ ఫైర్ ఉన్న నాయకుల్ని ప్రస్తావించారు. ఎన్టీఆర్, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, పరిటాల రవి, వంగవీటి రాధా, నాదెండ్ల వంటి పాత్రలు క్రమంగా స్టేజ్ మీదకు వస్తాయి. వాటికి డైలాగ్ పంచులు, కెమెరా స్కోప్, మ్యూజిక్ మాస్ మస్‌తీగా ఉంటాయి. కానీ ఈ కథలో నిజాన్ని ఎంత వరకూ వాడారో… కల్పన ఎంత దూరంగా తీసుకెళ్లారో అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. మొత్తం మీద… మయసభ ఒక పొలిటికల్ డ్రామా కాదు, అది ఓ పొలిటికల్ ‘బ్రహ్మాండం’. చూడాలనిపించేలా ఉంది కానీ, నమ్మేయడం మాత్రం ఇంకొంచెం కష్టం! రాజకీయం తెలిసిన వారికి ఇది ఒక రీలే… రియాలిటీకి నమ్మిన వారికి మాత్రం ఇది ఓ మిస్ ఫైర్…!


మరింత సమాచారం తెలుసుకోండి: