
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ వార్ 2 చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయాన్ని సోషల్ మీడియా అభిమానుల కోసం తెలియజేసింది. వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుక యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ఆగస్టు 10 వ తేదీన చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సాయంత్రం 5 గంటలకు ఈవెంట్ మొదలవుతుందని తెలియజేశారు. ఈ విషయం విన్న వెంటనే అభిమానులు సైతం తెగ సంబరపడిపోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా రోజుకొక పోస్టర్ ను బృందం విడుదల చేస్తోంది.
తాజాగా ఒక పోస్టర్ మరింత అభిమానులను ఆకట్టుకునేలా చేస్తోంది .ఎన్టీఆర్ ,హృతిక్ రోషన్ మధ్య యాక్షన్ సన్నివేశాల కు సంబంధించి ఐమాక్స్ పోస్టర్ విడుదల చేయగా చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. అలాగే ఇందులో కియార అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. బికినీ తోనే హైప్ పెంచేసింది. గతంలో ఎన్టీఆర్ దేవర చిత్రానికి ఎలాంటి బహిరంగ ఈవెంట్ కూడా జరగకపోవడంతో డిసప్పాయింట్లో ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పుడు వార్ 2 సినిమా విషయంలో ఎన్టీఆర్ వచ్చి మాట్లాడతారని అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చేస్తున్నారు. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరెవరు వస్తారో చూడాలి మరి.