విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ కే మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ షాలిని పాండే. తన మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. అవకాశాలు వచ్చిన కూడా సక్సెస్ కాలేక పోయింది. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నిరంతరం సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది షాలిని పాండే.


సుమారుగా సోషల్ మీడియాలో 25 లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న షాలిని తన ఫాలోవర్స్ ని ఆకట్టుకునేందుకు రెగ్యులర్గా వీడియోలు ,ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.. తాజాగా షాలిని పాండే  డాన్స్ వేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. గతంలో చిన్నచిన్న దుస్తులను ధరించి అందాల ఆరబోత చేసిన షాలిని పాండే ఇప్పుడు అంతకుమించి అన్నట్లుగా డాన్స్ తో చూపు తిప్పుకొని అందంతో కుర్రకారులను ఆకట్టుకుంటోంది. డాన్స్ స్టూడియోలో ఈ ముద్దుగుమ్మ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ వీడియో తీసినట్లుగా సమాచారం.


షాలిని పాండే చాలా స్టైలిష్ గా డాన్స్ చేస్తూ ఈ భిన్నమైన యాంగిల్స్ లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి తగ్గట్టుగానే షాలినీ పాండే స్టెప్స్ లు వేస్తోంది. పొట్టి నిక్కర్ లో షాలిని పాండే వేసిన ఈ డాన్స్ వీడియోని అభిమానులు వైరల్ గా చేస్తున్నారు. అర్జున్ రెడ్డి చిత్రంలో లిప్ లాక్ సన్నివేశాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒకటి రెండు చిన్న చిన్న చిత్రాలలో నటిస్తోంది తప్ప పెద్ద సినిమాలలో నటించడం లేదు. గతంలో కాస్త బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ స్లిమ్ అవ్వడం వల్ల అవకాశాలు తగ్గిపోయాయంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: