సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌థ‌లు చేతులు మార‌డం ఎంత కామ‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఒక హీరో వ‌దులుకున్న‌ క‌థ‌తో మ‌రొక హీరో సినిమా చేయ‌డం అనేది జ‌రుగుతూనే ఉంటుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా గ‌తంలో చాలా క‌థ‌ల‌ను రిజెక్ట్ చేశాడు. క‌థ న‌చ్చినా కొన్నింటిని డేట్స్ స‌ర్దుబాటు చేయ‌లేక వ‌దిలేశాడు. అలా వ‌దిలేసిన వాటిలో ఓ డిజాస్ట‌ర్ మూవీ కూడా ఉంది. అయితే ఎన్టీఆర్ త‌ప్పించుకోగా.. పాపం యూత్ స్టార్ నితిన్ ఆ డిజాస్ట‌ర్ కు బ‌లైపోయాడు. ఇంత‌కీ ఆ సినిమా మ‌రేదో కాదు `శ్రీనివాస కళ్యాణం`.


`శతమానం భవతి`తో డీసెంట్ హిట్ కొట్టిన‌ సతీష్ వేగేశ్న.. త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ గా ఎన్టీఆర్ కోసం శ్రీనివాస కళ్యాణం అనే కథను డిజైన్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ ను క‌లిసి స్టోరీ నెరేష‌న్ ఇవ్వ‌గా.. ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై ఎన్టీఆర్‌-స‌తీష్ వేగేశ్న కాంబోలో ఆల్మోస్ట్ సినిమా ఒకే అయింది. అయితే ఎన్టీఆర్ కాల్షీట్స్ ఖాళీగా లేకపోవ‌డంతో ప్రాజెక్టు హోల్డ్ లో పడే పరిస్థితికి వచ్చింది.


దాంతో నిర్మాత దిల్ రాజు క‌ల‌గ‌జేసుకుని మిడ్ రేంజ్ హీరోతో ఈ కథని చేస్తే బెటర్ అని భావించారు. దిల్ రాజు సూచ‌న మేర‌కు నితిన్ కు స్టోరీ చెప్పగా ఆయ‌న ఓకే చెప్పారు. రాశి ఖన్నా హీరోయిన్ గా చేసింది. నందిత శ్వేత, రాజేంద్ర ప్రసాద్, ఆమని, ప్రకాష్ రాజ్, జయసుధ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించ‌గా.. మిక్కీ జే. మేయర్ సంగీతం అందించారు. 2018లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల అంచ‌నాలను అందుకోలేక‌పోయింది. క‌థ బాగున్న‌ప్ప‌టికీ.. స్క్రీన్ ప్లేలోని లోపాల కార‌ణంగా శ్రీనివాస కళ్యాణం బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ గా నిలిచింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: