
చాలా గ్యాప్ తర్వాత తమ అభిమాన హీరోని చూసే ఛాన్స్ వార్ 2 ద్వారా రావడంతో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దామా అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆగస్టు 10వ తేదీన గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్ . ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కూడా పాల్గొనబోతున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక ప్రారంభం కాబోతుంది .
అయితే కేవలం కొద్ది గంటల్లోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ఒక సెన్సేషనల్ డైలాగ్ వీడియోని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్ . ఈ వీడియోలో హృతిక్ రోషన్ అదే విధంగా ఎన్టీఆర్ ఇద్దరు కూడా పోటాపోటీగా తమ వార్ ని ఫినిష్ చేసే పనిలో బిజీ అయినట్లు క్లియర్ గా చెప్పొచ్చు . వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ .."ఒక్కసారి ఒకే ఒక్కసారి ..ఇదే ఆఖరి సారి ..నో రూల్స్..నో ఋఆవ్.. తలపడుదాం..నువ్వు నేను మాత్రమే.. ఫస్ట్ వచ్చిన వాడే విన్ ..సెకండ్ వచ్చిన వాడి చాప్టర్ క్లోజ్ "అంటూ చాలా గంభీరంగా హుందాగా చెప్పిన డైలాగ్స్ బాగా వైరల్ అవుతున్నాయి . చూస్తుంటే ఈ సినిమా బాలీవుడ్ రికార్డ్స్ అన్నిటిని బ్లాస్ట్ చేసే విధంగానే ఉన్నట్లు ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . ఇన్ని రోజులు రిలీజ్ అయిన అప్డేట్స్ వేరు తాజాగా రిలీజ్ అయిన వీడియో మాత్రం వార్ 2 పై హై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది . సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ డైలాగ్ బాగా ట్రెండ్ అవుతుంది..!!