
అంతేకాదు ఈ సినిమాలో మొత్తంగా ఐదుగురు హీరోయిన్స్ ఉంటారు అంటూ టాక్ వినిపిస్తుంది . లేటెస్ట్ గా ఈ సినిమాలో ఒక స్టార్ సీనియర్ హీరోయిన్ నెగిటివ్ షేడ్శ్ పాత్రలో కనిపించబోతుంది అన్న న్యూస్ బయటకు వచ్చింది . ఈ వార్తలో ఎంత వాస్తవం ఉంది అనేది పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. ఒక లేడీ సీనియర్ హీరోయిన్ విలన్ గానా మైండ్ బ్లోయింగ్ ..ఇలాంటి ఐడియాలు నీకు ఎక్కడి నుంచి వస్తాయి అట్లీ అంటూ పొగిడేస్తున్నారు అభిమానులు . అంతేకాదు ఈ సినిమాలో మొత్తంగా తొమ్మిది మంది స్టార్స్ ని గెస్ట్ పాత్రలో చూపించబోతున్నారట .
మరి ఆ గెస్ట్ రోల్ కోసం అట్లీ ఎవరెవరిని చూస్ చేసుకున్నారు అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా స్టోరీ మొత్తం ఓ మాఫియా డాన్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది . అల్లు అర్జున్ డాన్ గా.. మిడిల్ క్లాస్ బాయ్ గా ..అదే విధంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కూడా మెరవబోతున్నారట . మొత్తంగా ఫస్ట్ టైం ట్రిపుల్ రోల్ లో అల్లు అర్జున్ నటించబోతూ ఉండటం ఈ సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్ . అంతేకాకుండా మొత్తం ఐదుగురు హీరోయిన్స్ ని అట్లీ ఈ సినిమాలో చూపించబోతున్నారు అంటూ కూడా తెలుస్తుంది . మూడు షేడ్స్ లో ..ఐదు మంది హీరోయిన్స్ తో రొమాన్స్.. లేడీ విలన్ గా ఒక సీనియర్ హీరోయిన్.. ఇక తొమ్మిది మంది గెస్ట్ రోల్స్ ..ఈ సినిమాలో చూపించడం ఒకటి కాదు రెండు కాదు అన్ని ప్లస్ పాయింట్స్ అంటున్నారు జనాలు . చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..? ఒకపక్క బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో అల్లు అర్జున్ ని పొగిడేస్తున్నారు. ఇవన్నీ నిజమైతే మాత్రం మిగతా స్టార్స్ అట్లీ - బన్నీ రికార్డులను బద్దలు కొట్టాలి అంటే సుస్సు పోయాల్సిందే అంటూ బోల్డ్ గా కామెంట్స్ చేస్తున్నారు ..!!