రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే పెళ్లైన సమయంలో ఉపాసనపై చాలా విమర్శలు వచ్చాయి. అసలు రామ్ చరణ్ ఆమెను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇండస్ట్రీలో హీరోగా ఎదుగుతున్న ఈయనకి ఇలాంటి భార్యనా..అసలు ఆమె ఫేస్ చూసారా.. అంటూ ఉపాసనపై ఎంతో ట్రోలింగ్ జరిగింది.కానీ ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఉపాసన కృంగిపోలేదు. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా రామ్ చరణ్ కంటే అందంగా తయారై ఆమెను విమర్శలు చేసిన వారి నోటి నుండే అబ్బ ఎంత అందంగా తయారయ్యిందో అని నోరెళ్లబెట్టేలా చేసింది. అయితే అలాంటి ఉపాసన తాజాగా  యూట్యూబ్ హోమ్ టూర్ తమ హైదరాబాద్ ఐస్ క్రీమ్ కహాని బయటపెట్టింది. 

ప్రేమలో ఉన్న సమయంలో చాలామంది తమ లవర్స్ కి లవ్ టెస్టులు పెడుతూ ఉంటారు.అలా ఉపాసన కూడా రామ్ చరణ్ కి ఒక లవ్ టెస్ట్ పెట్టిందట. అదేంటంటే హైదరాబాద్ ఐస్ క్రీమ్.. ఇక అసలు విషయం ఏమిటంటే.. నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తే హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో ఉన్న ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్ కి నన్ను తీసుకు వెళ్లాల్సిందే అని ఉపాసన లవ్ టెస్టు పెట్టిందట. అయితే లవ్ టెస్ట్ లో పాస్ అవ్వాలని అనుకున్న రామ్ చరణ్ వెంటనే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ కి తీసుకెళ్లారట. కానీ అక్కడికి వెళ్లడంతోనే రామ్ చరణ్ చూసి చాలా మంది జనాలు ఎగబడ్డారట.

 ఇక నన్ను డేట్ కి తీసుకు వెళ్లడం కాదు ఆయన్ని చూసి జనాలంతా మీదికి ఎగబడితే అది నిజమైన లవ్ టెస్ట్ అంటూ ఉపాసన నవ్వుకుంటూ చెప్పింది. ఇక రామ్ చరణ్ చిరంజీవి గారు ఇద్దరు కూడా మంచి ఫుడ్ లవర్స్ అని,రామ్ చరణ్ కి రసం అన్నం అంటే ఇష్టమని, చిరంజీవి గారికి దోశ అంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. అలాగే రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా కూడా ఇండియన్ ఫుడ్ ఉండే రెస్టారెంట్ కావాలనే వెతుకుతాడని తెలియజేసింది. అంతేకాకుండా తమది మగధీర స్టైల్ లవ్ స్టోరీ అయితే కాదని ఒకరినొకరం ప్రేమించుకుని జీవితంలో అర్థం చేసుకుంటూ ముందుకు వెళుతున్న బంధం అంటూ ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: