గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆఖరుగా గేమ్ చెంజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా విడుదల అయ్యాక ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేయడంలో తీవ్రంగా విఫలం అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలక్షన్లను వసూలు చేయడంలో విఫలం అయిన ఈ సంవత్సరంలో ఓ విషయంలో మాత్రం ఇప్పటికీ ఈ సినిమా టాప్ పొజిషన్ లోనే నిలిచింది. అది ఇందులో అనుకుంటున్నారా ..? 2025 వ సంవత్సరంలో యూ ఎస్ ఏ లో ప్రీమియర్స్ ఫ్రీ సేల్స్ విషయంలో నాలుగు రోజుల ముందు అత్యధిక సేల్స్ ను జరుపుకున్న సినిమాలలో టాప్ స్థానంలో గేమ్ చెంజర్ మూవీ ఇప్పటివరకు కొనసాగుతుంది.

గేమ్ చెంజర్ మూవీ యూ ఎస్ ఏ లో ప్రీమియర్స్ ఫ్రీ సెల్స్ విషయంలో విడుదలకు నాలుగు రోజుల ముందు వరకు 522 కే కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటివరకు ఈ సంవత్సరం చాలా సినిమాలు విడుదల అయ్యాయి. కానీ అందులో ఏ సినిమా కూడా విడుదలకు నాలుగు రోజుల ముందు యు ఎస్ ఏ లో ప్రీమియర్స్ ఫ్రీ సేల్స్ ద్వారా గేమ్ చెంజర్ సినిమా స్థాయి కలెక్షన్లను రాబట్టలేదు. ఇకపోతే మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న కూలీ సినిమా విడుదలకు నాలుగు రోజుల ముందు వరకు యూ ఎస్ ఏ ప్రీమియర్ ప్రీ సేల్స్ ద్వారా 372 కే కలెక్షన్లను రాబట్టింది. ఇకపోతే కొంత కాలం క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా విడుదలకు నాలుగు రోజుల ముందు యూ ఎస్ ఏ ప్రీమియర్ ప్రీ సేల్స్ ద్వారా 273 కే సేల్స్ ను సొంతం చేసుకుంది. ఇక మరికొంత కాలంలో విడుదల కానున్న వార్ 2 మూవీ విడుదలకు నాలుగు రోజుల ముందు యూ ఎస్ ఏ లో ప్రీమియర్స్ ఫ్రీ సేల్స్ ద్వారా 242 కే సేల్స్ ను సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: